NewsOrbit
న్యూస్

Ramya Murder Case: రమ్య హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష!తొమ్మిది నెలల్లోనే ముగిసిన ట్రయిల్!వర్క్ అవుట్ అయిన జగన్ “దిశ ఇన్షియేటివ్”!

Ramya Murder Case: ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్య కేసులో నిందితునికి మరణ శిక్ష పడడం కన్నా ఈ కేసులో కేవలం తొమ్మిది నెలల్లోనే తుది తీర్పు రావటం అనేది అభినందనీయమయిన విషయం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పేరిట అమలుచేస్తున్న కార్యక్రమం ఫలితంగానే ఇది సాధ్యపడిందన్నది వాస్తవం.సహజంగానే ఇది జగన్ సర్కారు ఇమేజ్ ని పెంచగలిగే విషయం.అందువల్లే ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు.హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

Death sentence for accused in Ramya murder case!
Death sentence for accused in Ramya murder case

Ramya Murder Case: అసలేం జరిగిందంటే!

నల్లపు రమ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ప్రేమించి భంగపడిన కుంచాల శశికృష్ణ అనే యువకుడు గుంటూరులో 2021 ఆగస్టు పదిహేనో తేదీన నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేశాడు.సంచలనం రేపిన ఈ నేర ఘటన పై పోలీసులు తీవ్రంగా స్పందించారు.

Death sentence for accused in Ramya murder case!
Death sentence for accused in Ramya murder case

పది గంటల్లో హంతకుడు పట్టివేత!

హతురాలి తండ్రి ఫిర్యాదు అందగానే పోలీసులు విస్తృత గాలింపు జరిపి కేవలం పది గంటల వ్యవధిలో నిందితుడిని నర్సరావు పేట సమీపంలో పట్టుకున్నారు.మారణాయుధాన్ని స్వాధీనపర్చుకున్నారు.ఇక డీఎన్ఏ రిపోర్టు కూడా కేవలం రెండు రోజుల వ్యవధిలో వచ్చేసింది.గతంలో డీఎన్ఏ రిపోర్ట్ రావటానికి నెలల తరబడి పట్టిన సందర్భాలు ఉన్నాయి.అన్ని సాక్ష్యాధారాలను క్రోడీకరించుకుని నిందితుడిపై వారం రోజుల లోపలే పోలీసులు చార్జిషీటు కూడా దాఖలు చేశారు.

Ramya Murder Case: జెట్ స్పీడ్ లో విచారణ!

ఇక ఈ కేసులో విచారణ గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి న గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రారంభమై శరవేగంతో సాగింది.మొత్తం ఇరవై ఎనిమిది మంది సాక్షులను విచారించారు.నిందితుడి సెల్ఫోన్ డేటాను, అతడు నేరానికి ఉపయోగించిన కత్తిని, వాహనాన్ని కూడా పరిశీలించారు. నాలుగు నెలల లోపలే విచారణ ముగిసింది.శుక్రవారం ఈ కేసులో నిందితుడు శశి కృష్ణకు మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తుది తీర్పును ఇచ్చారు.ఈ తీర్పుపై హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.ఇంత త్వరగా మరణ శిక్ష పడేంత కేసు తేలిపోవటం రాష్ట్ర చరిత్రలో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు.

సీఎం జగన్ హర్షం!

ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఒక క్రూరమైన నేరంలో నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా చేసిన పోలీసు వ్యవస్థను ఆయన అభినందించారు.ఇదే విధంగా అన్ని కేసుల్లో కూడా పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

author avatar
Yandamuri

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju