Prabhas : ప్రభాస్ సలార్ ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా రామగుండం కోల్ మైన్స్ లో ప్రారంభం అయిన ప్రభాస్ సలార్ ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్స్ సీన్స్ ని కంప్లీట్ చేస్తున్నారట. దాదాపు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావస్తుందని సమాచారం. ఈ క్రమంలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగబోతున్నట్టు సమాచారం. కాగా కొత్తగా ప్రారంభించబోయే షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు శృతి హాసన్ పాల్గొనే కీలకమైన సన్నివేశాలతో పాటు ఇద్దరి మీద ఒక సాంగ్ ని కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది.
కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కి విపరీతంగా పాపులారిటీ వచ్చేసింది. ఇక డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్న ప్ర్భాస్ వరసగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలనే చేస్తున్నాడు. సలార్ తో పాటు బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆది పురుష్ కూడా సెట్స్ మీదకి వచ్చింది. ఒకవైపు సలార్ చేస్తూనే మరొక వైపు ఆదిపురుష్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఆది పురుష్ సినిమా ముంబై లో జరుగుతుండగా.. సలార్ మాత్రం ఎక్కువభాగం హైదరాబాద్ లో జరగనుందట.
Prabhas : సలార్ లో స్పెషల్ సాంగ్ లో దీపిక పదుకొణె స్టెప్పులేయబోతున్నది నిజమా..?
కాగా ఇప్పుడు సలార్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సలార్ కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని తీసుకురాబోతున్నారట. అయితే హీరోయిన్ గా కాదు. సలార్ లో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉండగా ఆ సాంగ్ కోసం దీపిక ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ తో దీపిక పదుకొణె వైజయంతీ మూవీస్ వారు నిర్మించబోయో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ లో నటిస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి సలార్ లో స్పెషల్ సాంగ్ లో దీపిక పదుకొణె స్టెప్పులేయబోతున్నది నిజమా కాదా అన్నది అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?