Deepika Pilli : దీపికా పిల్లి Deepika Pilli తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్. తను టిక్ టాక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. తర్వాత సోషల్ మీడియా స్టార్ అవ్వడమే కాదు.. ఇప్పుడు తెలుగు బుల్లితెర మీద కూడా తెగ హడావుడి చేస్తోంది. దీపికా పిల్లి అంటేనే ఆ రేంజ్ వేరు.

దీపికా పిల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా గురించి అవగాహన ఉన్నవాళ్లందరికీ తను సుపరిచతమే. తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు.
తనకు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఢీ 13లో దీపికకు అవకాశం ఇచ్చారు మల్లెమాల యాజమాన్యం. దీపిక కంటే ముందు వర్షిణి యాంకర్ గా ఉండేది. వర్షిణిని తీసేసి.. ఆమె స్థానంలో దీపికను పెట్టుకున్నారు. దీపిక కోసమే ఢీ షోను చూసేవాళ్లు కోకొల్లలు.
Deepika Pilli : దీపికా పిల్లిని ఆడుకుంటున్న యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, సుధీర్?
మామూలుగానే ఢీ షో అంటే డ్యాన్స్ తో పాటు సూపర్ డూపర్ ఫన్ ఉంటుంది. కామెడీ కూడా అదిరిపోతుంది. జబర్దస్త్ కమెడియన్లు సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో పాటు యాంకర్ ప్రదీప్ కూడా ఈ షోకు ప్లస్సే. అలాగే.. యాంకర్ రష్మీ కూడా ఈ షోలో కనువిందు చేస్తుంది.
వీళ్లతో పాటు.. దీపిక పిల్లి కూడా ఈషోలో సందడి చేస్తుండటంతో ఈ షోకు వస్తున్న పాపులారిటీ మామూలుగా లేదు. అయితే.. దీపికను మాత్రం వీళ్లు తెగ ఆడేసుకుంటున్నారు. హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్.. దీపికకు మామూలు పంచులు వేయడం లేదు.
దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వచ్చింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.