Deepthi bhatnagar: 13 ఏళ్ళ తర్వాత అంతే అందంతో ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్ర రావు హీరోయిన్ దీప్తి భట్నాగర్

Share

Deepthi bhatnagar: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చూపించిన ఏ హీరోయిన్‌ని మన తెలుగు ప్రేక్షకులు అసలు మర్చిపోరు. ఆయన చూపించినట్టుగా నాటి నుంచి నేటి వరకు టాలీవుడ్ దర్శకులెవరూ హీరోయిన్స్‌ని గ్లామర్‌గా చూపించలేదు. 16 ఏళ్ళ వయసు సినిమాలో శ్రీదేవి నుంచి మొదలుకొని ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెళ్ళి సందడి సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల వరకు ఆయన మార్క్ పడిన వారే.

deepthi-bhatnagar-is back once again after 13 years
deepthi-bhatnagar-is back once again after 13 years

రాఘవేంద్ర రావు సినిమా అంటే పాటల్లో పూలు, పళ్ళు హీరోయిన్ అందాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగులు పెడతారు. శ్రీదేవి, విజయశాంతి, రమ్యకృష్ణ, నగ్మా, మధుబాల, రంభ, రవళి, మీనా, శిల్పా శెట్టి, దివ్య భారతి, శోభన, ఆ తర్వాత అదితి అగర్వాల్, తాప్సీ లాంటి హీరోయిన్స్ సహా ఆయన దర్శకత్వంలో నటించిన హీరోయిన్స్ అందరిని అందంగా చూపించి ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశారు. అందుకే రాఘవేంద్ర రావు సినిమాలలో హీరోయిన్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.

Deepthi bhatnagar: అలాంటి హీరోయిన్స్‌లో దీప్తి భట్నాగర్ ఒకరు.

రాఘవేంద్ర రావు సినిమాలో గ్లామర్‌గా నటించాలని ఆయనతో నాభి మీద పూలు, పళ్లు విసిరించుకోవాలని ఆతృతగా ఎదురు చూసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు హీరోయిన్స్ ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పిన సందర్భం కూడా ఉంది. అంటే గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్ రావాలంటే కేరాఫ్ రాఘవేంద్ర రావు అని సౌత్ అండ్ నార్త్ హీరోయిన్స్ అందరూ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అలాంటి హీరోయిన్స్‌లో దీప్తి భట్నాగర్ ఒకరు. 1996లో పెళ్లి సందడి రిలీజయింది. ఈ సినిమాతో శ్రీకాంత్ స్టార్ హీరోగా సెటిలయ్యాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది రవళి, ముంబై భామ దీప్తి భట్నాగర్. ఇద్దరికీ పెళ్ళి సందడి సినిమాతో దర్శకేంద్రుడు సాలీడ్ హిట్ ఇచ్చి బ్రేక్ ఇచ్చాడు. హీరోగా శ్రీకాంత్ కి ఏ రేంజ్ పాపులారిటీ వచ్చిందో హీరోయిన్స్‌గా రవళి, దీప్తి భట్నాగర్‌కి ఆ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా సన్నజాజి నడుముతో కవ్వించే పరువాలతో స్మైలీ క్వీన్ గా దీప్తీ భట్నాగర్ కొన్ని లక్షల మందికి డ్రీం గర్ల్ గా మారిపోయింది. అంతటి క్రేజ్ ఇచ్చాడు రాఘవేంద్ర రావు. ఆ క్రేజ్ తో టాలీవుడ్‌లో వరుసగా ఆటో డ్రైవర్, సుల్తాన్, మా అన్నయ్య వంటి సినిమాలు చేసింది.

Deepthi bhatnagar: 13 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్శకేంద్రుడే దీప్తీ భట్నాగర్‌ని తెలుగు సినిమాలో చూపించబోతున్నాడు.

అయితే ఆ తర్వాత ఎందుకనో దీప్తి భట్నాగర్ తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్శకేంద్రుడే దీప్తీ భట్నాగర్‌ని తెలుగు సినిమాలో చూపించబోతున్నాడు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కొడుకు రోషన్ – శ్రీలీల జంటగా పెళ్ళి సందడి అనే టైటిల్‌తోనే రూపొందించారు. టైటిల్‌లో చిన్న మార్పుతో అదే రొమాంటిక్ జోనర్‌లో ఈ సినిమా రూపొందింది.

గౌరీ రోనంకీ ఈ సినిమాతో దర్శకురాలిగా మారుతోంది. కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇందులో దర్శకేంద్రుడు ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో కలలరాణి దీప్తీ భట్నాగర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. రాఘవేంద్ర రావు కోరిక మేరకు తెలుగులో మళ్ళీ కనిపించడానికి ఈమె ఒప్పుకుందట. అంటే శ్రీకాంత్ – దీప్తీ ఇందులో కాసేపు జంటగా నటిస్తున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇక 53 ఏళ్ళు దాటినా దీప్తీ భట్నాగర్‌లో అందం మాత్రం కాస్త కూడా తగ్గలేదు. అదే అందంతో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటోంది.


Share

Related posts

RRR: “RRR” బ్యూటీ కి కరోనా పాజిటివ్..!! 

sekhar

Tollywood: ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పోటీ మామూలుగా లేదు..!!

sekhar

ఆచార్య లో మెగాస్టార్ ఇంట్రో సాంగ్ కోసం అన్ని కోట్లా… అమ్మో కొరటాలా అంటున్నారు ..?

GRK