Deepthi Sunaina: దీప్తి షణ్ముఖ్‌ల మీద ‘ రెడ్డి ‘ గారి దారుణ కామెంట్ లు .. ఇలా అనేశారు ఏంటి !

Share

Deepthi Sunaina:తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్‌ 5‌లో పార్టిసిపెంట్లుగా అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ఘాటైన రొమాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే మొగుడుపెళ్లామ్స్ లాగా వీరిద్దరూ హగ్గులు, కిస్సులతో రెచ్చిపోవడం చూసి దీప్తి సునైనా జీర్ణించుకోలేకపోయిందని తెలుస్తోంది. ఇటీవలే షణ్ముఖ్‌తో బ్రేకప్ చేసుకోడానికి కూడా ఇదే కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీప్తి – షణ్ముఖ్‌ల మీద వివాదాస్పద నటి శ్రీరెడ్డి దారుణంగా కామెంట్లు చేసింది. ఆమె అలా అనేసరికి అందరూ అవాక్కవుతున్నారు.

Sri Reddy: దీప్తి షణ్ముఖ్‌ల మీద ‘రెడ్డి’ గారి దారుణ కామెంట్లు


“షణ్ముఖ్‌-దీప్తిల జంట చూస్తుంటే ముచ్చటేస్తుంది. అలా చూడచక్కగా కనిపించే వీరిద్దరూ ఉన్నపళంగా తెగతెంపులు చేసుకోవడం నాతో సహా అందరినీ బాధించింది. రోజులు మారుతున్నా మనుషులు పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావడం లేదు. కొన్ని విషయాల్లో చాలా సున్నితంగా ఉంటూ పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనుషులు అన్నాక ఏదో ఒక సందర్భంలో తప్పులు చేయడం అసాధారణం ఏమీ కాదు. అలాగని ఆ తప్పులను ఎత్తిచూపుతూ వారికి దూరమైతే ఇక బంధాలకు అర్థం ఏముంటుంది. దీప్తి… నువ్వు షణ్ముఖ్‌తో ఐదు సంవత్సరాలపాటు ప్రేమ బంధంలో ఉన్నావు. అతడిపై ఎంతో ప్రేమ పెంచుకున్నావు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ వంద రోజుల పాటు జరిగిన బిగ్‌బాస్‌లో షణ్ముఖ్‌ చేసిన రొమాన్స్ కారణంగానే మీ ఐదేళ్ల బంధానికి వీడ్కోలు పలికావని క్లియర్‌గా అర్ధం అవుతుంది.” అంటూ శ్రీరెడ్డి(Sri Reddy) చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆమె దారుణంగా కామెంట్స్ చేసింది.

ఆ పర్సన్‌తో నువ్వు ఏమన్నా తక్కువ చేశావా

“అమ్మా దీప్తి.. షణ్ముఖ్‌ చేసింది తప్పే అంటున్నావ్, సరే.. మరి నువ్వు బిగ్‌బాస్ కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో చేసింది ఏంటి? అతడితో నువ్వు హద్దులు దాటి మరీ రొమాన్స్ చేశావు కదా.. ఇదంతా ప్రజలంతా కూడా చూశారు. నువ్వు అతడిని ప్రేమిస్తున్నావేమో అని అందరూ అనుకునేలా రొమాన్స్ చేశావు. నువ్వు వేరే మగాడితో రొమాన్స్ చేస్తే తప్పు కాదు కానీ ఇప్పుడు షణ్ముఖ్‌ చేస్తేనేమో తప్పా? అండ‌ర్‌స్టాండింగ్ లేకపోతే ఎలా? చిన్న తప్పులను క్షమించాలి. కొంచెం ఓపికతో ఆలోచించి క్షమిస్తే అన్ని సమస్యలు వాటంతట అవే సమసి పోతాయి. అలా కాదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందే నువ్వు టాటూ వేయించుకున్నావ్. కానీ ఇప్పుడేమో షణ్ముఖ్‌ నుంచి విడిపోయారు. ఈ మాత్రం దానికి ఏదో పెద్ద నమ్మకం ఉన్నట్లు టాటూ వేయించుకోవడం ఎందుకు?” అని దీప్తి ఘనకార్యం గురించి చెబుతూ దారుణమైన కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి. చాలామంది శ్రీ రెడ్డి చేసిన కామెంట్లతో ఏకీభవిస్తున్నారు. మరి కొందరు మాత్రం దీప్తి- షణ్ముఖ్ దొందుకు దొందే.. వాళ్ళిద్దరూ తప్పులు చేశారు.. తప్పులను క్షమించి కలిసిపోవడం మంచిది. విడిపోయి వాళ్లు ఇప్పుడు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


Share

Related posts

కరోనా చేసిన కీడే కాదు..! ఆర్ధిక మేలు కూడా చూడండి..!!

bharani jella

రూ.కోట్లు పెట్టి కొన్న ఫ్రెండ్ కారును.. గోడ‌కు గుద్దేశాడు.. వైర‌ల్ వీడియో..!

Srikanth A

Viral Video: పోలీసులను చూసి పోసుకున్నాడు..! హల్చల్ చేస్తున్న వీడియో..!!

bharani jella