Deepti-shanmukh: ప్రస్తుతం సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునయన జంట హాట్ టాపిక్ గా మారింది. బేసిగ్గా యూట్యూబ్ స్టార్స్ అయినటువంటి షణ్ముఖ్, దీప్తి సునైనాలు తాజాగా తమ బంధానికి బ్రేకప్ చెప్పిన విషయం విదితమే. ఇద్దరి మధ్య మొదటినుండి మంచి ర్యాపో ఉంది. అలాంటిది సడెన్ గా వారు బ్రేకప్ చెప్పుకోవడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి కారణాలు వారు చెప్పనప్పటికీ.. సిరినే వారి బ్రేకప్ కి మెయిన్ రీజన్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లిన షణ్ముఖ్.. తోటి కంటెస్టెంట్ సిరితో బాగా క్లోజ్ అవ్వడం అందరికీ తెలిసిన తతంగమే.
Deepti-shanmukh: బిగ్ బాస్ లో వారి ప్రవర్తనే షన్ను కొంప ముంచిందా?
అవుననే అంటున్నారు కొందరు. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ చాలా ఎమోషనల్ కనెక్ట్ అవడం మనం చూసాం. బిగ్ బాస్ ఫ్లోర్ లో హగ్గులు, ముద్దులతో తెగ రెచ్చిపోయారు. ఒకరి మీద ఒకరు అలగడం, మళ్లీ సారీ చెప్పుకోవడం, తరువాత కౌగిలించుకోవడం చేసేవారు. అక్కడ వీరి బిహేవియర్ కారణంగా ఆడియన్స్ ఒకింత అసహనానికి గురయ్యారనే చెప్పుకోవాలి. ఇకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా ఇంటర్వ్యూలలో సిరి-షణ్ముఖ్ లు మంచి ప్రేమికులనే చెప్పేవారు. కానీ షణ్ముఖ్, సిరి మాత్రం తామిద్దరం స్నేహితులం మాత్రమేనని పలుసార్లు చెప్పడం కొసమెరుపు.
ఇంతకీ ఈ సిరి బాయ్ ఫ్రెండ్ ఎవరు?
దీప్తి, షణ్ముఖ్ రిలేషన్ బ్రేక్ అవడం ఒకెత్తయితే, ఇప్పుడు తాజాగా సిరి రిలేషన్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. విషయంలోకి వెళితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే సిరికి, శ్రీహాన్ అనే ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. అతడు బిగ్ బాస్ స్టేజ్ పైకి ఓ సారి రావడం, సిరితో ‘నన్ను వదిలేస్తున్నావా?’ అని అడగడం జరిగింది. దానికి సిరి సారీ చెప్పి శ్రీహాన్ ను కూల్ చేసింది.. అది వేరే విషయం. అయితే ఇప్పుడు వారి మధ్యకూడా మనస్పర్థలు వచ్చాయని, త్వరలో విడిపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.