Deepthi Sunaina: దీప్తి సునైనా నే తన కోడలు అనుకుంటున్న షన్ను తల్లి – బ్రేకప్ న్యూస్ తెలిసి … !!

Share

Deepthi Sunaina:  ప్రస్తుతం తెలుగు గ్రామర్ వ‌రల్డ్‌లో దీప్తి సునైనా, శ్రీహాన్, సిరి, షణ్ముఖ్ హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా ఐదేళ్ల బంధానికి స్వస్తి చెప్పిన దీప్తి, షణ్ముఖ్ గురించి అటు సోషల్ మీడియాలో ఇటు బయట పెద్ద చర్చే జరుగుతోంది. బిగ్‌బాస్‌ షో తర్వాత ఆమె షన్నుతో మాట్లాడనే లేదు. దీనికి కారణం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్న చందాన షణ్ముఖ్ బయట దీప్తితో, బిగ్‌బాస్‌ హౌజులో సిరి (siri hanmanth) తో హద్దులు మీరి, శృతి మించి, విచక్షణ కోల్పోయి రొమాన్స్ చేశాడు. అది కూడా కోట్లాదిమంది చూస్తుండగా! సూర్య వెబ్ సిరీస్‌తో తన పాపులారిటీని మరింత పెంచుకున్న షన్ను బిగ్‌బాస్‌కు వచ్చి అప్రతిష్ఠ మూట గట్టుకున్నాడు. చివరికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని కూడా కోల్పోయాడు.

Deepthi Sunaina: అంతా బిగ్‌బాస్‌యే చేసింది..

టీఆర్పీ రేటింగ్ వస్తుంది కదా అని బిగ్‌బాస్‌ యాజమాన్యం షన్ను-సిరిలని మరింత రెచ్చగొట్టింది. నాగార్జున నుంచి బిగ్‌బాస్‌ నిర్వాహకుల వరకు ప్రతి ఒక్కరూ ఒకే దుప్పట్లో దూరిపోయి మరీ.. ఘాటైన రొమాన్స్ చేసేలా షన్ను-సిరిలను పురమాయించారు. దాంతో ముద్దులకు, హగ్గులకు అంతే లేదన్నట్లుగా షన్ను తెగ రెచ్చిపోతున్నాడు. దీంతో ఒక మెంటల్ కేస్, ఒక చీటర్, నమ్మించి గొంతు కోసే దుర్మార్గుడినా.. నేను ప్రేమించింది అంటూ దీప్తి తెగ బాధపడి పోయిందని సన్నిహితుల సమాచారం. అందుకే ఆమె తన ఐదేళ్ల బంధాన్ని నిలుపుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వెరసి తెగతెంపులు చేసుకుంది. ఒకవేళ బిగ్‌బాస్‌కు వెళ్లకపోయినట్లయితే వీళ్లిద్దరు హాయిగా పెళ్లి చేసుకుని జీవితాన్ని ముందుకు సాగించేవారేమో. వీరి పచ్చని ప్రేమ బంధంలో బిగ్‌బాస్‌ చిచ్చుపెట్టాడు. ఏ నోట విన్నా ప్రస్తుతం ఇవే మాటలు వినవస్తున్నాయి. అభిమానుల నుంచి నెటిజన్లు, కుటుంబసభ్యులు వరకు బిగ్‌బాస్‌ ఓ దిక్కుమాలిన షో అని, ఇది కాపురంలో చిచ్చు పెట్టే బ్రోకర్ షో అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

దీప్తినే తన కోడలు అనుకుంటున్న షన్ను తల్లి – బ్రేకప్ న్యూస్ తెలిసి

అయితే ఇన్ని రోజులు ఇరు కుటుంబ సభ్యులు షన్ను-దీప్తిలను అల్లుడు కోడలు లాగా క్రియేట్ చేశారు. ఒకరిపై మరొకరు ప్రేమ పెంచుకున్నారు. అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడంతో షన్ను తల్లి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీప్తి నా కోడలు నా బంగారం అంటూ ఎప్పుడూ కూడా ఆమెపై చెన్ను తల్లి ఎంతో ప్రేమ అనురాగాలు కురిపించే వారట. కానీ తన కొడుక్కి బ్రేకప్ చెప్పిందని తెలుసుకొని చాలా బాధ పడుతున్నారట. బిగ్‌బాస్‌కు అనవసరంగా పంపించామని తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారట.


ఏదేమైనప్పటికీ ఒక శ్రీ రామచంద్ర, ఒక అభిజిత్ లాగా కాకుండా బిగ్‌బాస్‌ చెప్పినట్లు బొమ్మలా ఆడి ఇప్పుడు షణ్ముఖ్ బకరా అయ్యాడు. షన్ను ఆనందం కోసం దీప్తి ఎంతో ఖర్చు పెట్టింది. విలువైన బహుమతులు, దుస్తులు ఎలా లెక్కనేనన్ని వస్తువులను అతడికి నుంచి కొనిచ్చింది. కానీ అవన్నీ మరిచి బుద్ధి లేకుండా మరొక అమ్మాయితో రొమాన్స్ చేశాడని దీప్తి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో షన్ను, సిరి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ షన్ను క్యారెక్టర్ పై మచ్చే పడుతోంది.


Share

Related posts

Today Gold Rate : దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!!

bharani jella

Priyanka Mohan Latest Photos

Gallery Desk

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి..

bharani jella