ట్రెండింగ్ న్యూస్

యూట్యూబ్ ట్రెండింగ్ లో దీప్తి సునయన లవ్ సాంగ్?

Deepthi Sunaina song is trending online
Share

దీప్తి సునయన తెలుసు కదా. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్. అంతే కాదు.. యూట్యూబ్ లో, షార్ట్ మూవీస్ లో చాలా ఫేమస్. దీప్తి సునయనకు బుల్లితెర మీద బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకు సపరేట్ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆ చానెల్ లో లవ్ సాంగ్స్, ఇక షార్ట్ మూవీస్, ఇతర ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది దీప్తి.

Deepthi Sunaina song is trending online
Deepthi Sunaina song is trending online

అయితే.. తాజాగా దీప్తి సునయనకు చెందిన ఓ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఓ క్షణం నవ్వునే విసరు.. అంటూ సాగే లవ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈసాంగే. ఫీల్ గుడ్ గా ఉన్న ఈ సాంగ్ ను నేటి యువతరం బాగా ఎంజాయ్ చేస్తోంది. అందుకే ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

ఈ పాటలో దీప్తి సునయన, సుమంత్ ప్రభాస్ నటించారు. తన ఇంటి కింద రెంట్ కు వచ్చిన దీప్తిని చూసి సుమంత్ లవ్ లో పడతాడు. తనను ప్రేమిస్తుంటాడు. తను ఎలా చూడగానే లవ్ చేస్తాడో.. దీప్తి కూడా తనను చూడగానే లవ్ చేస్తుంది. కానీ.. ఇద్దరు తమ లవ్ విషయం ఎవ్వరికీ చెప్పరు. తర్వాత దీప్తి ఇద్దరి పెయింటింగ్ వేస్తుంది. ఆ పెయింటింగ్ ను చూశాక.. సుమంత్ కు అర్థం అవుతుంది.. దీప్తి కూడా తనను లవ్ చేస్తోందని.. మొత్తం మీద పాట మాత్రం అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చూసి.. ప్రేమానుభూతిని పొందండి.


Share

Related posts

Acharya: బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్‌కు రెడీ అయిన మెగా హీరోస్..

GRK

రాజుగారిని పంపడానికి పర్ఫెక్ట్ పాయింట్ దొరికింది!

Yandamuri

పవన్ కళ్యాణ్ ఫాన్స్ జన్మలో పోసాని ఋణం తీర్చుకోలేరు

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar