Deepti-shanmukh : బుల్లితెర ఎంటర్మైంట్ బిగ్ బాస్ షో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. ఈ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎందరికో లైఫ్ ఇచ్చి పాపులర్ చేసింది. బిగ్‌బాస్ షోలో ఎంటర్ అయిన తరువాత కొందరు పాపులారిటీని సాధిస్తే మరికొందరు నెగిటివిటీని మూటగట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి హన్మంత్ లు నెగిటివిటీనీ మూటగట్టుకున్నారు. దీంతో షణ్ముఖ్ ప్రేమ బంధానికి ముగింపు పడింది.
Meera jasmine: లేటు వయసులో మీరాజాస్మిన్ గ్లామర్ షో..బాబోయ్ చూసి తట్టుకోవడం కష్టమే!
Deepti-shanmukh : బర్త్ డే విషెస్ ని పట్టించుకోని సునైన
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ కి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఈ క్రమంలో బ్రేకప్ తర్వాత దీప్తి సునయన పుట్టినరోజు సందర్భంగా షణ్ముఖ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ… ఆమెతో కలిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు. అందులో ‘హ్యాపీ బర్త్ డే డీ’ అని రాసి దానికి వీరిరువురు కలిసి నటించిన ‘మలుపు’ అనే ఒక సాంగ్‌ను జత చేశాడు. కానీ దీప్తి సునయన ఇవన్నీ పట్టించుకోలేదు.
Bangarraju movie: బాగా వీకైపోయిన `బంగార్రాజు`.. సూపర్ హిట్ అవ్వాలంటే ఇంకెంత రాబట్టాలో తెలుసా?
ఒంటరిగా బతుకుతున్నారు అంటూ దీప్తి కోట్..
తాజాగా, దీప్తి సునయన ఇన్స్టాగ్రామ్ లో ఓ కోట్ ను షేర్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. ఈ కొత్త సంవత్సరంలో కొంతమంది ఒంటరిగా బతుకుతున్నారు.. మరికొందరు బాధల్లో ఉన్నారు.. ఇంకొందరు డోలో వేసుకుంటూ ఉన్నారు అని ఓ పోస్ట్‌ను దీప్తి సునయన తన ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది. తాను ఈ మూడు పరిస్థితులు అనుభవిస్తున్నట్టు ఇండైకెర్ట్ గా చెప్పేసింది. కాగా, వీరిద్దరి బ్రేకప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వీరి బ్రేకప్ స్టోరీపై ఇప్పటికే రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.