Deepti Sunaina: షణ్ముఖ్ – దీప్తి సునైనా.. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించే రాతలు కనబడుతున్నాయి. షన్ను బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన అనంతరం దీప్తి షన్ను కి బ్రేకప్ చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. అదిగో అప్పటినుండి ఈ రచ్చ మొదలైంది. ఎంతైనా సెలిబ్రిటీలు మరి. గాసిప్స్ ఆగుతాయా? బేసిగ్గా యూట్యూబ్ స్టార్స్ అయినటువంటి షన్ను దీప్తి మొదటినుండి మంచి క్లోజ్ ఫ్రెండ్స్.. అది కాస్త ముదిరి ముదిరి ప్రేమ వైపు దారి తీసింది. ఇంకేముంది కట్ చేస్తే బ్రేకప్ చెప్పి విడిపోయారు.
Deepti Sunaina: ఆ విషయాన్ని షన్ను ఎలా మేనేజ్ చేస్తున్నాడు?
బిగ్ బాస్ షో షన్ను పాలిట శాపం అయ్యిందని తన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. షోలో భాగంగా షన్ను కొంచెం మితిమీరడనే విషయం మనం ఒప్పుకోవలసిందే. కానీ అది అక్కడివరకే పరిమితం అనుకున్నాడు షన్ను. కానీ అది తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని ఊహించలేకపోయాడు. అవును.. సిరితో చనువుని కొంచెం అతిగా ప్రదర్శించాడని షో చూసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఏముంది… కట్ చేస్తే దీప్తి కటీఫ్ చెప్పింది.
షన్ను సన్నిహితులు చెబుతున్నవి ఇవే..
దీప్తి ఎడబాటుని షన్ను తట్టుకోలేకపోతున్నాడని అంటున్నారు. వీలైతే దీప్తితో మాట్లాడి ఈ విషయాన్ని మళ్ళీ సెటిల్ చేసుకోవాలని చూస్తున్నాడట. ఓ వైపు సిరి – శ్రీహాన్ మంచిగా ఎంజాయ్ చేస్తుంటే, పాపం షన్ను పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇక షన్ను అభిమానులు అయితే సరిగ్గా నిద్రే పోవడం లేదట. షన్ను బ్రేకప్ విషయంలో వారు చాలా తీవ్రంగా ఫీల్ అవుతున్నారని వినికిడి.