Deepti Sunaina: బిగ్ బాస్ సంగతి ఏమో గాని, ఆ షో పుణ్యమాని అందమైన జంటలు విడిపోతున్నాయి. అవును.. బిగ్ బాస్ తెలుగు సీజన్ – 5 రెండు జంటలను విడదీసిందంటే నమ్మితీరాల్సిందే. అందులో ఒకటి షణ్ముక్ జశ్వంత్ – దీప్తి సునయన జంట. చూడముచ్చటైన ఈ జంటకు బిగ్ బాస్ దిష్టి తగిలిందో ఏమో గాని, కట్ చేస్తే దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పింది. ఇక రెండో జంట శ్రీహాన్ – సిరి హనుమంతు. శ్రీహాన్ – సిరి తమ బ్రేకప్ అయినట్లు ఎక్కడా చెప్పుకోలేదు కానీ.. వ్యవహారం చూస్తుంటే తేడా కొట్టినట్లేనని స్పష్టంగా గోచరిస్తోంది.
Deepti Sunaina: శ్రీరెడ్డి vs దీప్తి సునైనా కహానీ ఇదే మరి!
షన్ను దీప్తి వ్యవహారంలో కొందరు దీప్తిని సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరు షన్నుని సపోర్ట్ చేస్తున్నారు. అలా దీప్తి సునయన నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శించిన వారిలో శ్రీరెడ్డి ఒకరు. ఇక శ్రీరెడ్డి గురించి ఇక్కడ ప్రస్తావించడం అనవసరం అనుకుంట. పలు వివాదాలకు పెట్టింది పేరు శ్రీరెడ్డి. తన పని తాను చూసుకోకుండా ఎదుటి వాళ్ళ జీవితాలలో వేలు పెట్టి కెలకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీప్తి సునయన బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్‌గా లోపలికి వెళ్లినప్పుడు అక్కడున్న ఓ వ్యక్తితో స్నేహంగా మెలిగిన విషయాన్ని హైలెట్ చేసింది శ్రీరెడ్డి.
Cancer: క్యాన్సర్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి తినండి చాలు..!!
దానికి దీప్తి రియాక్షన్ ఇదే…
తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన దీప్తి సునయన ఇన్ డైరెక్ట్‌గా శ్రీరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది. తాను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు తన వయసు కేవలం 20 యేళ్లేనని అప్పట్లో రిలేషన్షిప్స్, బిగ్ బాస్ హౌస్ మీద అవగాహన లేదని, కానీ బిగ్ బాస్ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని ఆమె చెప్పింది. అంతేకాకుండా శ్రీరెడ్డి లాంటి పేరాసైట్స్ మాటలు తాను అస్సలు పట్టించుకోనని గట్టిగా చెప్పింది.