Deepti Sunaina: దీప్తి సునైనా ని అడ్డంగా బుక్ చేసిన శ్రీరెడ్డి.. షన్ను తో బ్రేకప్ విషయం లో భారీ ట్విస్ట్..!

Share

Deepti  Sunaina: షణ్ముఖ్-దీప్తి సునయన ఈ పేర్లు తెలియని వారు ఎవరు వుండరు. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులరీటిని పెంచుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటి అవుతారు అనుకుంటే ఒక్కసారిగా విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు వీళ్ళ బ్రేకప్ విషయంలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి (Srireddy) ఎంటర్ అయ్యి షాకింగ్ కామెంట్స్ చేసింది. జరిగిపోయిన విషయాలను గుర్తుచేస్తూ దీప్తి సునయనా(Deepti  Sunaina)పై చురకలు వేసింది శ్రీరెడ్డి.

Deepti  Sunaina: దీప్తి, షన్ను ప్రేమ యవ్వారంలోకి దూరిన శ్రీరెడ్డి :

ఈ విషయంపై శ్రీరెడ్డి స్పందిస్తూ దీప్తి సునయన (Deepti  Sunaina) పాత విషయాలను తవ్వుకుని వచ్చింది. షణ్ముఖ్ ఐదో సీజన్‌ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే, షణ్ముఖ్ కంటే ముందుగానే దీప్తి రెండో సీజన్‌కి కంటెస్టెంట్‌గా వెళ్లింది. రెండవ సీజన్‌లో దీప్తి, తనీష్‌ తో క్లోజ్‌ గా మూవ్ అవ్వడంతో వారి రిలేషన్‌ పై చాలా ఊహాగానాలు వినిపించాయి. బ్రేకప్ విషయం గురించి దీప్తిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఈ విధంగా చెప్పుకొచ్చింది. ‘సోషల్ మీడియా సన్సేషనల్ స్టార్స్ గా షణ్ముఖ్- దీప్తి సునయన విడిపోవడం చాలా బాధగా ఉంది. దీప్తి సునయన, షణ్ముఖ్ ఇద్దరు బాగా పాపులర్. నిజానికి వీళ్లిద్దరూ చూడచక్కని జంట అని చెప్పవచ్చు. అలాంటి వాళ్లు బ్రేకప్ చెప్పుకోవడం నన్ను కూడా కలవరపాటుకు గురిచేసింది.

గతం గుర్తుచేసుకో అని దీప్తికి చురకలు అంటించిన శ్రీరెడ్డి :

మనం ఎన్ని చేసినా గాని మనం. భారతీయులం అని మాత్రం మరిచిపోకూడదు. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా గాని మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదు. అలాగే మనం మనుషులు, తప్పులు చేయడం కూడా సహజమే అని, దీప్తి గురించి నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే.. దీప్తి నువ్వు షణ్ముఖ్‌ తో కలిసి ఐదేళ్ల పాటు కలిసి ప్రయాణం చేశావ్. ఎన్నో ఆటు పోట్లు ఎదురుకున్నావు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నువ్వు హర్ట్ అయ్యి షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పావని తెలుస్తుంది. మరి షన్ను కంటే నువ్వే ముందుగా బిగ్ బాస్‌కి వెళ్ళావ్. అక్కడ ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా మూవ్ అయ్యావో నీకె తెలుసు.. అప్పుడు నీకు అది తప్పుగా అనిపించలేదా..? ఇప్పుడు షణ్ముఖ్ సిరితో క్లోజ్‌గా ఉండేటప్పటికి నీకు తప్పు అయిందా.ఇప్పుడు బ్రేకప్‌కి చెప్పడానికి కారణం షణ్ముఖ్‌తో పెళ్లి కాలేదు కాబట్టి. అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ని వదిలేసేదానివా..మనిషి అన్నాక తప్పులు చేయక మానరు .

అలాంటి వాళ్ళు టాటూలు వేయించుకోకండి- శ్రీరెడ్డి :

ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ అనేది ఉండాలి. ఒకరి తప్పుల్ని మరొకరు క్షమించుకుంటూ ఓపికతో ఉంటే సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇకపోతే టాటూల విషయానికి వస్తే.. పెళ్లికి ముందు చాలామంది టాటూలు వేయించుకుని విడిపోతున్నారు. దీప్తి సునయన (Deepti  Sunaina), షణ్ముఖ్ ఇద్దరూ కూడా టాటూలు వేయించుకున్నారు. ఇప్పుడు దీప్తి సునైనా ఆ టాటూను రిమూవ్ చేయించుకోవాలని భావిస్తుంది. ఎందుకలా.. మీపై మీకు నమ్మకం లేకపోతే అసలు ఇలా టాటూలు వేయించుకోవడం దేనికి..? మళ్ళీ వాటిని తొలగించుకోవడం దేనికి అంటూ శ్రీరెడ్డి రియాక్ట్ అయింది.


Share

Related posts

Telangana High Court: జగన్ కేసుల్లో హైకోర్టు బిగ్ షాక్ ..! వాయిదా కోరితే రూ.50వేలు జరిమానా అంటూ హెచ్చరిక..!!

somaraju sharma

Immunity Power: ఈ లక్షణాలు ఉంటే ఇమ్యూనిటీపవర్ లేనట్టే..!!

bharani jella

తమన్నాని వెంటాడుతున్న “ఆ కల” ..?

GRK