Deepti Sunaina : ప్రస్తుతం సోషల్ మీడియాలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ల బ్రేకప్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లోను, సోషల్ మీడియా లోనూ రకరకాల వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. షణ్ముఖ్ కూడా సోషల్ మీడియాలో బాగానే పేరును సంపాదించుకున్నాడు. ఈ ఇద్దరూ కూడా మా టీవిలో ప్రసారమయిన అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో లోకి హౌస్ మేట్స్ గా వెళ్లారు. అయితే ఇద్దరూ కూడా ఒకేసారి కాకుండా వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ హోస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
Deepti Sunaina : బిగ్ బాస్ లోకి రాకముందే షన్ను, దీప్తి రిలేషన్ షిప్ లో ఉన్నారా..?
దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 2 లో పార్టిసిపేట్ చేయగా షన్ను మాత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే.. వీరిద్దరూ వేరు వేరు సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరూ కూడా తమ ప్రేమకు గుర్తుగా చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. మరి అంతలా ప్రేమించుకున్న ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం చూసి వారి అభిమానులు సైతం ఎంతగానో బాధ పడుతున్నారు.
Deepti Sunaina : పాపం షన్ను బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచినా ఏ మాత్రం సంతోషంగా లేడు.. ఎందుకంటే..?
షన్ను “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ గా నిలిచినా గాని ఆ సంతోషం షణ్ముఖ్ జస్వంత్ కు ఎన్నో రోజులు నిలబడలేదు. ఎందుకంటే షన్ను ఎంతగానో ప్రేమించిన దీప్తి సునైనా తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నట్టు అధికారంగా ప్రకటించింది. అలాగే దీప్తి నిర్ణయాన్ని కూడా షణ్ముఖ్ స్వాగతించాడు. అది పూర్తిగా తన ఇష్టం అని దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక్కడితో మేటర్ అయిపొయింది అని అనుకున్నారు అంతా.. కానీ., వీరి ప్రేమకధలో వివాదాస్పద నటి అయిన శ్రీరెడ్డి మధ్యలో ఎంటర్ అయ్యి దీప్తిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
షన్ను, దీప్తి ప్రేమ కధలోకి శ్రీ రెడ్డి ఎందుకు వచ్చిందబ్బా..? తనీష్ ను ఎందుకు లాగింది..?
దీప్తి తన బ్రేకప్ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తరువాత శ్రీరెడ్డి దీప్తిని ఉద్దేశించి నువ్వు “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2″లో చేసిందేంటి.. అప్పుడు తనీష్‌తో క్లోజ్ గా ఉన్నావ్ కదా.. మరి ఇప్పుడు షన్ను సిరి తో క్లోజ్ గా ఉన్నాడని బ్రేకప్ చెప్పడం కరెక్టా.. నువ్వు చేస్తే ఒప్పు.. అదే పని షన్ను చేస్తే తప్పా అన్నట్టు దీప్తిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా దీప్తి సునైనా స్పందిస్తూ ఆమెకి తిరిగి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి.
శ్రీరెడ్డికి జలక్ ఇచ్చిన దీప్తి:
“నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోకి ప్రవేశించినప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే.. ఆ షోలో పాల్గొన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నిజంగా హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి నాకు ఎటువంటి క్లారిటీ గాని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అనే విషయాలపై అవగాహనా లేదు. ఎందుకంటే ఆ వయసులో నాకు పెద్దగా అలోచించి నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ లేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా నేను జీవితంలో ఎలా ఉండాలో అనే చాలా విషయాలను నేర్చుకున్నాను” అంటూ శ్రీ రెడ్డిని ఉద్దేశించి చెప్పుకొచ్చింది దీప్తి. ఏది ఎలా ఉన్నాగాని బిగ్ బాస్-5 హౌస్ లో షన్ను, సిరితో క్లోజ్ గా ఉండడం చూసి బాగా హర్ట్ అయ్యి ఉంటుందని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది.