Ramdev Baba Vs IMA: యోగా గురు ను మరో వైపు నుండి నరుక్కొచ్చిన ఐఎంఏ!రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!!

Share

Ramdev Baba Vs IMA: అల్లోపతి వైద్యం మీద ఆ కోవకు చెందిన వైద్యుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ గత పది రోజులుగా వార్తల్లో ఉంటున్న యోగా గురు బాబా రాందేవ్ కు షాక్ తగిలింది.నిన్నమొన్నటి వరకు బాబా రామ్దేవ్ తొమ్మిది చేసిన వ్యాఖ్యలపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వచ్చిన ఐఎంఏ ఈసారి వరసమార్చింది.ఇది వర్కవుట్ అయ్యింది.బాబా రామ్దేవ్కు ఢిల్లీ హై కోర్టు నుండి సమన్లు జారీ అయ్యే వరకు పరిస్థితి వచ్చింది.

Delhi High Court issues notices to Ramdev Baba
Delhi High Court issues notices to Ramdev Baba

కరోనిల్ పై కోర్టుకెక్కిన ఢిల్లీ ఐఎంఎ!

రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ తయారు చేస్తున్న కరోనిల్‌కు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అలాంటి సమాచారం వ్యాప్తి చేయకుండా రామ్‌దేవ్‌ బాబాను ఆపాలంటూ కోర్టులో దావా వేసింది.కరోనాను తమ సంస్థ తయారు చేస్తున్న కరోనిల్ నయం చేస్తానంటూ పతంజలి సంస్థ విస్తృత ప్రచారం చేస్తోందని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ ను గురువారం విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు బాబా రాందేవ్ కు సమన్లు జారీ చేసింది.ఐఎంఎకి రాందేవ్ కు మధ్య జరుగుతున్న వివాదం లో ఇదో కొత్త మలుపు అనే చెప్పాలి.

ముజఫర్ పూర్ కోర్టులో మరో పిటిషన్

ఇదిలావుండగా బాబా రాందేవ్ కు వ్యతిరేకంగా ముజఫర్ పూర్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.బీహార్ కు చెందిన జ్ఘాన్ ప్రకాశ్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలంటూ ముజఫర్ పూర్ జ్యుడీషియల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆయన మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరాడు. విపత్తుల చట్టం కింద రామ్ దేవ్ మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్లో కోరాడు.దీనిని కూడా కోర్టు విచారణకు స్వీకరించింది.

Read More: Big Breaking: కేంద్రంపై పోరుకు జట్టు కడుతున్న జగన్..! సంచలన అంశాలతో లేఖ..!

పట్టుమీదున్న ఐఎంఎ!

కరోనా కట్టడిలో అల్లోపతి వైద్యం విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించడంతో దేశంలోనే కాదు ప్రపంచ వ్యప్తంగా కలకలం రేపింది. అల్లోపతి వైద్యులంతా ఆయనపైనే దృష్టి పెట్టారు.రామ్ దేవ్ పై అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీకి ఆయనపై ఫిర్యాదు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు.దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించారు.రామ్ దేవ్ కు వెయ్యి కోట్ల రూపాయల కు పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసు కూడా ఇచ్చారు.ఇప్పుడు కరోనిల్ పై ఫోకస్ పెట్టారు.మొత్తంగా చూస్తే ఐఎంఏ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రామ్ దేవ్ పై పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

 


Share

Related posts

Dethadi Harika : వైరల్ అవుతోన్న దేత్తడి హారిక ఫోక్ సాంగ్..!!

bharani jella

Big Breaking: ఈ నెల 21 నుండి ఫ్రీ వ్యాక్సిన్ మోడీ కీలక ప్రకటన.!!

P Sekhar

కేసీఆర్ సంచ‌ల‌న ఎత్తుగ‌డ… మ‌త రాజ‌కీయాలేనా?

sridhar