33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు బిగ్ షాక్  

Share

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సీబీఐ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించగా, బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితులకు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సమీర్ మహేంద్రుడు, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది.  లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే.

Delhi Liquor Scam

 

ఈ కేసులో నిందితులైన సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇళ్లను అటాచ్ చేయడంతో పాటు దినేష్ అరోరా రెస్టారెంట్, అమిత్ ఆరోరా ఆస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రూ.2,873 కోట్ల కుంభకోణం జరిగిందనీ అభియోగం కాగా ఇప్పటి వరకూ రూ.76,54 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. బెయిల్ పిటిషన్ లపై విచారణ సందర్భంలో సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖయ్లు చేసింది. లిక్కర్ స్కామ్ లో నిందితులపై ఈడీ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూ న్యాయమూర్తి నాగ్ పాల్ ఇచ్చిన ఉత్తర్వులో కీలక అంశాలు ప్రస్తావించడం జరిగింది.

సీనియర్ ఐఏఎస్ సోమేశ్ కుమార్ కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ..! ఆ ఉన్నత పోస్టులో నియామకానికి మార్గం సుగమం..!!


Share

Related posts

గర్భం దాల్చిన బాలిక.. తెల్లారేసరికి శవమైంది.. ఏం జరిగింది?

Muraliak

సెంట్రల్ ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

somaraju sharma

Prashant Kishor : పీకే రేంజ్ పెంచేసిన పంజాబ్ సర్కార్!సీఎం సలహాదారుడిగా క్యాబినెట్ హోదాతో నియామకం!!

Yandamuri