తెలంగాణ‌ న్యూస్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో బిగ్ రిలీఫ్

Share

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిటీ సివిల్ కోర్టులో రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ నేతలు ఆమెపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టును కవిత ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కవితపై ఆరోపణలు చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు నోటీసులు జారీ అయ్యాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇకపై కవితకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందంటూ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు చేయడంతో తెలంగాణలోని బీజేపీ నేతలు సీఎం కేసిఆర్ కుటుంబం టార్గెట్ గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.


Share

Related posts

Assembly Elections : ఆ అయిదు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

somaraju sharma

‘ఆయన పని అయిపోయింది’

somaraju sharma

సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ వ్యవహారంలో సరి కొత్త ట్విస్ట్ !

Yandamuri