Breaking: ఇటీవల కాలంలో విమానాలకు ఫేక్ బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల సిబ్బందితో పాటు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలాన్ని రేపింది. ఢిల్లీ నుండి పూణె బయలుదేరిన విస్తారా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లో బాంబులు ఉన్నాయంటూ ఫోన్ రావడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఫ్లైట్ మొత్తం తనిఖీలు చేశారు. భద్రతా సిబ్బంది నుండి అనుమతి వచ్చిన తర్వాత విమానం బయలుదేరుతుందనని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
ఈ విషయంపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందిస్తూ ఉదయం ఎయిర్ పోర్టులోని జీఎంఆర్ కాల్ సెంటర్ కు ఢిల్లీ – పూణె విస్తారా ఫ్లైట్ లో మూడు బాంబులు అమర్చినట్లు ఫోన్ వచ్చిందనీ, దీంతో వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి విమానాన్నిఅత్యవసర ల్యాండింగ్ చేశామన్నారు. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, విమానంలో ఎలాంటి బాంబును గుర్తించలేదన్నారు. విమానాశ్రయం సిబంది ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
YS Sharmila: వైఎస్ షర్మిల హౌస్ అరెస్టు .. ఇంటి వద్దే షర్మిల నిరాహార దీక్ష