NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం .. ఏడుగురు నవజాత శిశువుల మృతి

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు ఢిల్లీ ప్రాంతం వివేక్ విహార్ లో ఉన్న చిన్న పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన ఏడుగురు శిశువులు సజీవ దహనం అయ్యారు. మరో అయిదుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ ఐ సీయూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది వివరాల ప్రకారం శనివారం అర్ధ రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగిందని అగ్నిమాపక అధికారి రాజేష్ తెలిపారు. మంటల కారణంగా రెండు భవనాలు దెబ్బతిన్నాయి. ఆసుపత్రి భవనంతో పాటు కుడివైపున ఉన్న రెండు అంతస్తుల నివాస భవనం మంటల్లో చిక్కుకున్నాయి. 11 నుండి 12 మందిన అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పిల్లల ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదిగా స్పందిస్తూ సంతాపం తెలియజేశాయి. ఢిల్లీలోని వివేక్ విహార్ లోని ఆ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారులు మృతి చెందారన్న వార్త హృదయాన్ని కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ షాక్ ను తట్టుకునే శక్తిని తల్లిదండ్రులు, బంధువులకు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ఈ ఘటనలో గాయపడిన పిల్లలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటన హృదయ విదారకమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరినీ విడిచిపెట్టమని అన్నారు.

కాగా, ఘటన అనంతరం కేర్ సెంటర్ యజమాని నవీన్ కిచ్చి పరారైయ్యారు. అతనిపై ఢిల్లీ పోలీసులు సెక్షన్ 336, 304 ఏ కింద కేసు నమోదు చేశారు.

Lok Sabha Elections 2024: ముగిసిన ఆరో విడత పోలింగ్ .. అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N