ఢిల్లీ విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హస్తినను పొగమంచు కమ్మేయడంతో విమాన రాకపోకలకే కాకుండా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అలాగే నగరంలో వాహనాల కదలికలకు కూడా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఉదయం పది గంటల సమయంలో కూడా ఎదుట ఏముందో కనిపించనంత దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉండటంతో రోడ్లపై వాహనాల రాకపోకల వేగం బాగా మందగించింది.

దట్టమైన పొగ మంచు అలుము కోవడంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు  నిలిచిపోయాయి. అలాగే ఢిల్లీ రావలసిన విమానాల రాకకు కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నది.  పలు విమానాలను రీ షెడ్యూల్ చేశారు. కొన్నిటిని రద్దు చేశారు. దీంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

SHARE