ఈ మధ్య కాలం లో చాలామంది పిల్లలు, పెద్దలు చ్యూయింగ్ గమ్ లు మౌత్ ఫ్రెషనర్స్ గా వాడుతున్నారు. చూయింగ్ గం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఒకప్పుడు చెప్పేవారు. చిన్నపిల్లలకైతే దానితో పాటు బబుల్గమ్ మింగడం వల్ల అది లోపల ప్రేగులను చుట్టేస్తుందని భయపెట్టేవారు. కానీ వీటివలన మన ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొదట దీనిని భోజనం తర్వాత లేదా బోర్ కొట్టినపుడు నమలడం స్టార్ట్ చేస్తారు.
ఈ మధ్య చాలా మంది ఒత్తిడిగా అనిపించినా, ఏం తోచకపోయినా, పని చేస్తున్నప్పుడు నిద్ర నుంచి బయటపడడానికి వారికి వెంటనే చూయింగ్ గమ్ గుర్తుకువస్తుంది. ఆకలి అనిపించినా చూయింగ్ గమ్ ని నమిలేస్తున్నారు. చూయింగ్ గమ్ అనేది ప్రస్తుతం మన నిత్యజీవితంలో ఒక పార్ట్ లా మారిపోయింది. మరికొందరైతే.. చూయింగ్ గమ్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు.
చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వల్ల పంటి సమస్యలు వస్తాయంటున్నారు దంత వైద్యులు. వీటిల్లో ఎక్కువ స్థాయిలో చక్కెర ఉంటుంది. ఇవి పళ్లకు హాని కలిగిస్తాయి. కాబట్టి షుగర్ లేని చూయింగ్ గమ్ అయితే మంచిదని డెంటిస్ట్ లు సూచిస్తున్నారు. కానీ మీరు షుగర్ లేని చ్యూయింగ్ గమ్ తింటే దంత సమస్యలు రావట.
అంతేకాదు.. నడుస్తూ తినడం వల్ల అదనపు లాభాలు పొందుతామని హార్ట్ బీట్ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా నడుస్తూ తినడం వల్ల నడకలో వేగం కూడా వస్తుందని.. ముఖ్యంగా బరువు తగ్గుతామని చాలా కచ్చితం గా చెబుతున్నారు. నోటి దుర్వాసన తొలగించి, బరువు తగ్గిస్తుంది. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కదా అని వీటిని అధికంగా తింటే, హాని కూడా కలుగుతుందని గుర్తించండి.