Blood Group: రక్తంలో ఉండే గ్రూపును బట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియచేస్తున్నారు నిపుణులు . వాటి గురించి తెలుసుకుందాం. A గ్రూప్ రక్తం ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. దీనివలన వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు నిమ్మజాతికి చెందిన పండ్లు ఎక్కువగా తినడం మంచిది. అలాగే A గ్రూప్వారు మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ అధిక బరువు ఉంది తగ్గాలనుకుంటే మాత్రం ఆకుకూరలు,పండ్లు, బీన్స్, చిరుధాన్యాలు,గింజలు చేపలు వంటివి ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా వృద్ధి చెందుతుంది.
B గ్రూప్ రక్తం ఉన్నవారు గుడ్డు, ఆకుకూరలు,తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలు తినాలి. కార్న్, గింజలు, టమాటా, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. వీరికి సహజంగా జీవక్రియ ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతుంటారు. ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం చేయడం మంచిది. వీరి శరీరంలో కార్టిసోల్ హార్మోన్ విడుదల జగడం తో మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీరు కొవ్వు, నూనె పదార్థాలు, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం ఉత్తమం.
AB గ్రూప్ రక్తం ఉన్నవారు జీర్ణాశయంలో ఆమ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు యాపిల్ సైడర్ తేనె, మునగ, వెనిగర్ ను ఎక్కువగా తీసుకుంటుండాలి.చేపలు, ఆకుకూరలు, పాలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
O’ గ్రూప్ రక్తం ఉన్న వారికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మాంసం, చేపలు, గింజలు,కూరగాయలు, బీన్స్, ఆకుకూరలు రెగ్యులర్ గా ఆహారంలో తీసుకోవాలి.
ఈ ఆహారం నియమాలు పాటించడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.