NewsOrbit
న్యూస్

ఉపముఖ్యమంత్రే గానీ ఉత్సవ విగ్రహం అంట ! ఎవరాయన?

పదవి రావడం వేరు దాన్ని ఆలంబనగా చేసుకుని పవర్ చూపటం వేరు .అందరికీ ఆ కళఅబ్బదు.ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పరిస్థితి అదేనంటున్నారు.

Deputy Chief Minister or the festival idol  Who
Deputy Chief Minister or the festival idol Who


శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పెట్టని కోట. ఆ జిల్లాను ఇకపైన వైసీపీకి కంచుకోట చేయాలన్నది జగన్ నిర్ణయం. దానికోసమే ఆయన ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు. అంతే కాదు ధర్మాన కృష్ణ దాస్ ను ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారు. దాంతో జిల్లాను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైసీపీ పక్షం చేయాల్సిన అతి ముఖ్య బాధ్యత ధర్మాన మీద ఉంది. కానీ జిల్లాను శాసించే రాజకీయం ధర్మాన చేయలేకపోతున్నారని తన వారికి కూడా పదవులు ఇప్పించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇంతకు ముందు ధర్మాన కృష్ణదాసు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా చేశారు.

ప్రసాదరావు రెవిన్యూ మంత్రిగా ఉంటూ జిల్లాను మొత్తం గుప్పిట పట్టాడు. చీమ చిటుక్కుమన్నా కూడా క్షణాల్లో సమాచారం వచ్చేలా చేసుకొన్నాడు.పవర్ను పూర్తిగా అనుభవించాడు.తమ్ముడితో పోలిస్తే ధర్మాన కృష్ణ దాస్ చాలా మెత్తన. ఆయనకు అతి కీలకమైన పదవులు వస్తున్నాయి. కానీ పవర్ చూపించడం ఎలాగో తెలియడంలేదు. దాంతో క్యాడర్ సైతం డీలా పడుతోంది.ఆయన మెతకతనాన్ని చూసి జిల్లా ఇంచార్జి మంత్రి కొడాలి నాని అయితే సెటైర్లు కూడా వేశారు. తమ్ముడు ప్రసాదరావును చూసి నేర్చుకోవయ్యా అంటూ క్లాస్ కూడా తీసుకున్నారని ఆ మధ్యన ప్రచారం జరిగింది.

అపుడు ధర్మాన కృష్ణ దాస్ కేవలం మంత్రి మాత్రమే. ఇపుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జగన్ ఆయన హోదాను ఒక్కసారిగా పెంచేశారు. అయినా సరే ఏ విషయం మీదనైనా స్వేచ్చగా దూకుడుగా దాసన్న నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. జిల్లాలో పదవులు లేక క్యాడర్ అల్లాడుతోంది. లీడర్లు కూడా నిరాశలో ఉన్నారు. వారంతా ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ తిరుగుతున్నారు.తమకు ఏదైనా పదవి ఇప్పించండి అంటూ వైసీపీ నేతలు ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ ప్రదక్షిణం చేసినా వారికి ఆయన నుంచి చిరునవ్వు మాత్రమే బహుమానంగానే వస్తోంది.

గట్టిగా బతిమాలుకుంటే చెప్పి చూస్తానులే అని మరో మాట వస్తుందిట. అంతే తప్ప ఈ పదవి నీకే అంటూ గట్టి భరోసా ఇచ్చే ధైర్యం ఆయనకి లేదట.తన మనుషులకు ఈ సమయంలో నాలుగు పదవులు ఇప్పించుకునే దమ్ముని ఎందుకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ చూపించలేకపోతున్నారన్న ప్రశ్న కూడా వస్తోంది. మంత్రి పదవే ఎక్కువ అనుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చేయడంతో ఉబ్బితబ్బిబ్బయిన ధర్మాన కృష్ణదాస్ తన వరకు చూసుకుంటున్నాడని, క్యాడర్ను గాలికొదిలేశారని ఆయనపై వైసీపీలో అసమ్మతి వెల్లువెత్తుతోంది.

author avatar
Yandamuri

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju