క్రెడిట్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే లోన్ అంత సులభంగా, త్వరగా వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకులు,ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్లకు లోన్లు ఇచ్చేందుకు క్రెడిట్ స్కోరును ప్రధానంగా చూస్తుంటాయి. క్రెడిట్ స్కోరు కస్టమర్ గతంలో తీసుకున్న లోన్లను సరిగ్గా చెల్లిస్తున్నాడా, లేదా.. అనే విషయాన్ని తెలుపుతుంది. అయితే లోన్లు ఇచ్చేవారు మాత్రం కేవలం క్రెడిట్ స్కోరునే కాదు.. ఇంకా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్లే కొన్ని సార్లు క్రెడిట్ స్కోరు బాగున్నప్పటికీ లోన్ అప్లికేషన్లు రిజెక్ట్ అవుతుంటాయి. అయితే ఇందుకు గల కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
1. లోన్లు ఇచ్చేవారు కస్టమర్ ఆదాయం ఎంత ఉందో చూస్తారు. తాము ఇచ్చే లోన్‌కు గాను నెల నెలా ఈఎంఐ కట్టగలిగేంత ఆదాయం అతనికి వస్తుందా, రావడం లేదా.. అన్నవిషయాలను గమనిస్తారు. అందుకనే క్రెడిట్ స్కోరు బాగున్నప్పటికీ.. నెల నెలా సరైన ఆదాయం లేకపోతే.. లోన్ అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి.
2. ఇప్పటికే లోన్లు తీసుకుని వాటికి నెల నెలా అధిక మొత్తాల్లో ఈఎంఐలు చెల్లిస్తూ.. నెల నెలా వచ్చే ఆదాయంలో దాదాపుగా సగం వరకు ఈఎంఐలకే చెల్లిస్తుంటే.. అలాంటి కస్టమర్ల లోన్ అప్లికేషన్లను కూడా రిజెక్ట్ చేస్తారు. నెల నెలా ఈఎంఐలు సరిగ్గా చెల్లిస్తున్నా.. క్రెడిట్ స్కోరు బాగున్నా.. జీతంలో సగం వరకు ఆదాయం ఈఎంఐలకే చెల్లిస్తుంటే.. అలాంటి స్థితిలో లోన్లు ఇవ్వలేరు.
3. రిటైర్మెంట్ ఏజ్‌కు దగ్గర పడుతున్నవారికి కూడా లోన్లు ఇవ్వరు. ఆ సమయం వచ్చేసరికి పెండింగ్‌లో లోన్ ఉంటే.. వారికి నెల నెలా వచ్చే ఆదాయం రాదు కనుక.. వారు లోన్ చెల్లించలేని స్థితికి చేరుకుంటారని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. ఇలాంటప్పుడు కూడా లోన్లు ఇవ్వరు.
4. ఉద్యోగానుభవం తక్కువ ఉన్నా, తరచూ ఉద్యోగాలు మారుతున్నా.. అలాంటి వారికి క్రెడిట్ స్కోరు బాగున్నా లోన్లు ఇవ్వరు.
5. ఇక కొన్ని సందర్భాల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది కో అప్లికెంట్లుగా మారి లోన్లకు దరఖాస్తు చేయవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏ ఒక్కరి క్రెడిట్ హిస్టరీ బాగా లేకున్నా లోన్ ఇవ్వరు. ఇలా కూడా లోన్లు రిజెక్ట్ అవుతాయి. సహజంగా హోం లోన్లను ఈ విధంగా ఇస్తారు.
పైన చెప్పిన అంశాల ఆధారంగా కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లను ప్రాసెస్ చేస్తాయి. అన్ని అంశాలు బాగుంటేనే లోన్లు ఇస్తాయి. లేదంటే క్రెడిట్ స్కోరు ఒక్కటీ బాగున్నప్పటికీ చేసేదేమీ ఉండదు. లోన్లు రిజెక్ట్ అవుతాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?