Bigg Boss 5 Telugu: సోమవారం 41 వ రోజు జరిగిన ఎపిసోడ్ లో… ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చ గా సాగింది. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు ఇంటి సభ్యులు కలిగిన ఫోటోల కోతి బొమ్మలకి వేలాడుతుంటాయి. డేరాలో ఉన్న ముగ్గురు వేటగాళ్లు శ్రీరామ్, సన్నీ, జెస్సీ కోతులను చంపి వారిని నామినేట్ చేయాలి. వేటగాళ్లను ఒప్పించి వేరేవాళ్లను నామినేట్ చేయడం కోతుల లక్ష్యం. ఎక్కువ కోతులను నామినేట్ చేసిన వేటగాడు సేఫ్ అవగా మిగిలిన ఇద్దరు నామినేట్ అవుతారు.
ఈ క్రమంలో జంగిల్ సౌండ్ వినిపించిన తరుణంలో ఇంటిలో ఉన్న రెండు అరటి పండ్లను ఎవరు ఇద్దరూ పట్టుకుంటారో… ఆ ఇద్దరు నామినేట్ చేయవచ్చు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి వాదన బలంగా ఉంటుందో.. వేటగాడు నిర్ణయం బట్టి .. ఇద్దరు నామినేట్ చేసిన సభ్యులలో ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కువసార్లు హౌస్ లో సిరికి… అవకాశం వచ్చింది. ఇక ఇదే తరుణంలో పింకీ .. ప్రియా, రవి, యానీ, కాజల్ కి… అవకాశం లభించింది. వేటగాళ్లు గా ఉన్న శ్రీరామ్, జెస్సీ, సన్నీ లలో..సన్నీ.. ఎక్కువసార్లు వేటగాడి గా.. గెలిచాడు.
సన్నీతో.. భారీగా గొడవలు….
దీంతో సన్నీ నీ ఎలిమినేషన్ నామినేట్ నుండి తప్పించుకున్నాడు. దీంతో ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సభ్యుల వివరాలు…కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. వీరితో పాటు సీక్రెట్ రూమ్లో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే హౌస్ లో ఎలిమినేషన్.. ప్రక్రియలో.. వేటగాడు గా ఉన్న సన్నీతో.. భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి.