Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ హౌస్ లో భారీ అగ్గి రాజేసింది. ప్రియా.. లహరి పై చేసిన వ్యాఖ్యలు.. బిగ్ బాస్ హౌస్ లో మాత్రమేకాక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలతో అబ్బాయిలు తిరగటం తప్పులేదని.. అయితే ఈ గొడవ కి మూల కారణం రవి అంటూ.. నామినేషన్ ప్రక్రియ జరగక ముందు రవి ప్రియ తో లహరి గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో బయటపడటంతో… ఇంటి సభ్యుల మధ్య రవి చిచ్చు పెడుతున్నాడని.. నటరాజ్ మాస్టర్ చెప్పిన దాంట్లో తప్పులేదని నిజంగా హౌస్ కి రవి పెద్ద గుంట నక్క అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
మంగళవారం కూడా జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కాగా ఎక్కువ పోలైన ఓట్ల పరంగా చూసుకుంటే… మూడో వారం కి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు… శ్రీ రామచంద్ర, మానస్, లహరి, ప్రియా, ప్రియాంక సింగ్. వీరిలో ఎక్కువగా ప్రియా సోమవారం లహరి పై.. చేసిన కామెంట్లతో ఆమె గ్రాఫ్ పడిపోయిందని, కచ్చితంగా ఇంటినుండి ఆమె వెళ్లిపోవడం గ్యారెంటీ అని జనాలు విశ్లేషిస్తున్నారు.
ఏదిఏమైనా మూడవ వారం సీజన్ ఫైవ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మాత్రం.. ఇంటిలో సభ్యుల మధ్య కొత్త వాతావరణం క్రియేట్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే లహరి విషయంలో ప్రియ చేసిన కామెంట్ అదే రీతిలో అంతకుముందు ప్రియా కి వేరే విధంగా లహరి పై రవి చెప్పిన ప్రస్తావన విషయంలో నాగార్జున వీకెండ్ ఎపిసోడు లో ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఆడియన్స్ లో సస్పెన్స్ గా నెలకొంది.