Detergent: మనం వేసుకునే బట్టలు ఎప్పుడు తళ తళ మెరుస్తూ శుభ్రం గా మురికి లేకుండా సువాసన వస్తూ ఉండాలనుకుంటాము..దానికి తగినట్టుగా అన్ని చర్యలు తీసుకుంటాము.. మురికిగా ఉన్న బట్టలను డిటర్జెంట్ పౌడర్లు, డిటర్జెంట్ సబ్బు లతో ఉతుకుతాం.. అయితే అలా ఉతికినప్పుడు జాడించడం లో కానీ ఏమైనా డిటర్జెంట్ మిగిలి ఉండి పోతే అవి చర్మానికి హాని కలిగిస్తాయి.డిటర్జెంట్ పౌడర్ల తో మొటిమలుకూడా వచ్చేఅవకాశం ఉంది అని అంటున్నారు,స్కిన్ కేర్ నిపుణులు.
డిటర్జెంట్ పౌడర్ లను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలిసి ఉంటుంది. సువాసన తో ఉన్న డిటర్జెంట్లు, రసాయనాలు కలిపిన పౌడర్లు వాడడం వల్ల అలెర్జీల సమస్య తప్పదట. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు డిటర్జెంట్ ని ఎంచుకోవడం లో కూడా శ్రద్ధ తీసుకోవడం అవసరం. అందుకే రసాయనా లు తక్కువగా కలిగి ఉన్న డిటర్జెంట్లు, ఆర్గానిక్ డిటర్జెంట్లను ఉపయోగించడం చాల మంచిది.
డిటర్జెంట్లు కొనాలనుకున్నప్పుడు ఆ ప్యాక్ వెనుక నున్న రసాయనాలకు సంబంధించిన వివరాల ను చదివి తెలుసుకోవడం చాల అవసరం.డిటర్జెంట్ల లో బట్టలను శుభ్రం చే శాక బేకింగ్ సోడా లేదంటే వెనిగర్ ని నీటిలో కలిపి రెండు నిమిషాల పాటు జాడించి.. ఆరబెట్టడం మంచిది. ఇంకా సోడా, బోరాక్స్ పౌడర్ లను ఉపయోగించి ఇంట్లోనే సొంతగా డిటర్జెంట్ తయారు చేసుకోవచ్చు.
అలాగే వాషింగ్ మెషీన్ను కూడా శుభ్రం చేసుకుని వాడడం మంచిది . వాషింగ్ మెషీన్ను శుభ్రం చేసుకోకుండా అలానే సంవత్సరా ల పాటు వాడితే చర్మ సమస్యలువస్తాయని వైద్యులు తెలియచేస్తున్నారు. అందుకే వాషింగ్ మెషీన్ను బట్టలు ఉతికిన తర్వాత వెనిగర్, సోడా తోశుభ్రం చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియచేస్తున్నారు. కాబట్టి చర్మం ఆరోగ్యం గా ఎలాంటి ఇంఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే డిటర్జెంట్ ల వాడకం లో ఈ మాత్రం జాగ్రత్తలు పాటించవలిసిందే.