న్యూస్

Devatha Serial: ఆఫీసర్ సార్ తో దేవి తో ఎలా మాట్లాడించారో చూడండి.. అవ్వా.. పాపం ఆదిత్య..!!

Share

Devatha Serial: దేవి తనకు కన్న కూతురేనని తెలుసుకున్న ఆదిత్య ఒక్కసారి దేవిని దగ్గరకు తీసుకొని మనసారా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే.. విధి చేసిన వింత ఆటలో ఆదిత్య బలి అవుతాడు.. ఇన్ని రోజులు తన కూతురు అని తెలియకుండానే తనతో ఆడిపాడిన ఆదిత్య.. తన కన్నబిడ్డ అని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి కూడా తనను మనసారా దగ్గరకు తీసుకోలేకపోతాడు.. మరి ఈ రోజైనా తన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా..!? లేదంటే మళ్లీ ఎదురుదెబ్బే మిగులుతుందా..!? ఇప్పుడు చూద్దాం..!!

మాధవ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం తోనే ఆదిత్య పరుగుపరుగున దేవిని చూడడానికి వస్తాడు. అది చూసిన రుక్మిణి ఆదిత్య అని ఇంట్లోకి రానివ్వకుండానే.. ఇంత జరిగినా ఏం సార్ మళ్లీ వస్తారు అని అంటుంది. ఒక్కసారి దేవిని చూసి మనసారా మాట్లాడి వెళ్లిపోతాను అంటాడు. మీరు దేవి తో మాట్లాడటం వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో చేస్తున్నారు కదా.. మీరు రాకండి సార్ అంటూ వారిస్తుంది. మీరు రావడం నాకు ఇష్టం లేదు. మీతో మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు అనడంతో.. ఆదిత్య మీరు ఎంత దూరం చేసిన దేవి నాకు నాతో మాట్లాడుతుంది. అయితే ఇదే మాటను దేవితో చేప్పిస్తే ఇంకా మీరు రాకుండా ఉంటారా..!? అంటుంది దాంతో ఆదిత్య ఆ మాట ఎప్పటికీ దేవి అనదు.. నాకు లాగానే దేవి కూడా నన్ను చూడకుండా ఉండలేదు.. ఒకవేళ దేవి కూడా అదే మాట చెబితే మాత్రం రాకుండా ఉంటానని చెప్పేస్తాడు.. దాంతో రాధ దేవిని పిలుస్తుంది.. ఆఫీసర్ సార్ ని చూసిన ఆనందంలో దేవి దగ్గరికి వస్తుంది.. మదిలో వాళ్ళ నాన్న చెప్పిన మాటలు మదిలో మెదులుతూ ఉంటాయి. ఆ మాటలు గుర్తుంచుకున్న దేవి.. సార్ మా అమ్మ చెప్పింది నిజమే. నేను కూడా మీతో మాట్లాడను. పద్దాక దేవి దేవి అంటూ రాకండి.. అని చెప్పేసి అటువైపు తిరిగి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదిగో దేవి కూడా రావద్దు అని చెప్పిందిగా.. దేవి చెబితే ఈ ఇంటి వైపు దేవిని చూడడానికి రాను అన్నారుగా.. ఇక వెళ్ళిపొండి.. రావద్దు అంటూ రాధ ఇంట్లోకి వెళ్లి పోతుంది.

దేవి అన్న మాటలు నిజం కావాని.. ఆదిత్య మనసులో అనుకుంటాడు. గదిలోకి వెళ్లి బాధపడుతున్నా రాధ ను చూసి తన అంతరాత్మ వచ్చి నిలదిస్తుంది. అలా సంభాషణలు జరుగుతుండడందో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య దేవిని దూరంగా చూస్తూ ఉండిపోతాడు.


Share

Related posts

అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ఐదేళ్లు….సీన్‌లోకి మోదీజీ, ఇంటెలిజెన్స్

sridhar

Acharya : ఆచార్య.. నారప్ప సినిమాల మీద ఆప్రభావం పడితే బాధ్యులెవరు ..?

GRK

Traffic Police : ఈ సీతయ్య ఎవరి మాట వినడు…!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar