హైదరాబాద్ ఓటర్లకు స్ఫూర్తినిస్తున్న దేవరకొండ బ్రదర్స్

GHMC ఎన్నికల పోలింగ్ ఇప్పటివరకు 10 శాతం మాత్రమే నమోదయ్యింది. ఇప్పటివరకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖ పోలింగ్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచే చాలా మంది ప్రముఖులు ఓటు వేస్తున్నారు. సినీ తారలు, రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు తమ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు చలిని సైతం లెక్కచేయకుండా వారు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు

హైదరాబాద్ ఓటర్లకు స్ఫూర్తినిస్తున్న దేవరకొండ బ్రదర్స్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో చాలా మంది సినీ తారలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చ ఓటు వేసాడు. దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు  ఓటు వేశారు. విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలు అందరూ బయటకి వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కరోనా కి భయపడి వోటు వెయ్యకుండా ఇంట్లో ఉండడం సరికాదని  అందరూ వచ్చి ఓటు వెయ్యాలని ఆయన ప్రోత్సహించారు. ఇలానే ఎంతో మంది సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుని వేసి సామాన్యులకు స్ఫూర్తినిస్తున్నారు.