Devi Sri Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లలో చాలాకాలం దేవి శ్రీ ప్రసాద్ మార్కెట్ నీ ఏలటం జరిగింది. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన మాస్ సాంగ్స్ అందించడంలో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోలందరితో దేవిశ్రీప్రసాద్ పని చేయడం జరిగింది.
సినిమాలో ఐటెం సాంగ్స్ ఇవ్వడంలో.. దేవి సపరేటు బాణీలు ఇస్తూ సంగీత ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. దాదాపు ఇండస్ట్రీలో హీరోలకు ఉండే క్రేజ్ డీఎస్పీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అటువంటి దేవి శ్రీ ప్రసాద్ హీరోగా వస్తున్నట్లు ఎప్పటినుండో వార్తలు ఇండస్ట్రీ లో వైరల్ అవుతున్న యి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా నడుస్తోంది అని చెప్పవచ్చు.
Read more: Pawan kalyan: పవన్ అభిమానులు అంచనాలు పెంచేస్తున్న దేవిశ్రీప్రసాద్, హరీష్ శంకర్..!!
అలా వైకుంఠపురం లో సినిమా సాంగ్స్ తో సోషల్ మీడియాలో కళ్లుచెదిరే రికార్డులు సొంతం చేసుకున్న తమన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలు అన్నిటికీ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరిస్థితి ఇలా ఉండగా దేవీశ్రీప్రసాద్ హీరోగా సినిమా చేయాలని ఇండస్ట్రీలో లేడీ నిర్మాత తెగ ఆరాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న చార్మి. డీఎస్పీ అదే రీతిలో ఛార్మి మంచి ఫ్రెండ్స్ అని అందరిలో ఎప్పటినుండో టాక్ ఉంది. ప్రస్తుతం చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ ఉంది. కాగా తాజాగా తన ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా.. లాంచ్ చేయాలని ప్రత్యేక శ్రద్ధ.. చార్మి చూపిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.