టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని మార్కెట్ కలిగిన హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు వసూలు వస్తుంటాయి. అటువంటి పవన్ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. 10 సంవత్సరాలకు పైగానే పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడం తోటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్న క్రమంలో హరీష్ శంకర్ పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు.
ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో అప్పటికి ఉన్న అన్ని సినిమాల రికార్డులను అధిగమించడం జరిగింది. పైగా హరీష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో.. అభిమానులు పవన్ ని వెండితెరపై ఎలా చూడాలి అని అనుకున్నారు ఆ స్థాయిలో చూపించడంతో..” గబ్బర్ సింగ్” సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలకు పైగానే అయ్యింది. అయితే మళ్లీ చాన్నాళ్ల తర్వాత హరీష్ దర్శకత్వంలో పవన్ సినిమా వస్తున్న తరుణంలో అభిమానులు అంచనాలు ఓరేంజ్ లో పెట్టుకున్నారు.
పైగా పవన్ కళ్యాణ్ బర్తడే రోజు సినిమాకి సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ తో హరీష్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా పై మరింత ఆసక్తి పెంచింది. ఇలాంటి తరుణంలో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్లో ఈ సినిమాకి సంబంధించి పెట్టిన ట్వీట్ ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తోంది. మేటర్ లోకి వెళ్తే సినిమాకి సంబంధించిన స్టోరీ వినటం జరిగిందని, స్క్రీన్ పై ఆ సన్నివేశాలు చూడటానికి ఎంతో ఆశగా ఆత్రంగా ఉన్నట్లు.. పవన్ – హరీష్ లేటెస్ట్ సినిమా స్టోరీ అదిరిపోయినట్లు చెప్పుకొచ్చారు. దీంతో డీఎస్పీ చేసిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు.