ముస్లీం యూనివర్శిటీలో సరస్వతీదేవి ఆలయం!

లక్నో,డిసెంబరు29: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని మతపరమైన వివాదాల్లోకి లాగే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి వివాదం కూడా గతంలో లాగా సంఘ్ పరివార్ శక్తుల డిమాండ్ కారణంగానే తలెత్తింది. విశ్వవిద్యాలయం ఆవరణలో సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించాలన్నది తాజా డిమాండ్. యూనివర్శిటీలో ఎల్‌ఎల్ఎం చదువుతున్నవిద్యార్ధి అజయ్‌సింగ్ ఈ డిమాండ్‌తో యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌కు లేఖ రాశాడు. అలీఘఢ్ నియోజకవర్గ బిజెపి శాసనసభ్యుడైన దల్వీర్ సింగ్ కుమారుడు అజయ్‌సింగ్. జాతీయ మైనార్టీ విద్య పర్యవేక్షణ సంఘం సభ్యులు డాక్టర్ మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు. గత నెలలో కాశ్మీర్‌లేని భారత చిత్రపటాన్ని కొందరు విద్యార్దులు యూనివర్శిటీ గోడపై అంటించారు. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్‌ఆలీ జిన్నా చిత్ర పటాన్ని యూనివర్శిటీలో పెట్టడానికి సంబంధించి కొద్దికాలం క్రితం పెద్ద దుమారం చెలరేగింది.