మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన దేవినేని ఉమా..!!

పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ ఇరిగేషన్ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం సబ్జెక్టు తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేశారు. పోలవరం ఓవరాల్ ప్రాజెక్ట్ 71.2% కంప్లీట్ చేశాను అని ప్రచురించారు. అలాంటప్పుడు ఎందుకు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని, అర మీసం తీసుకుంటా…, ఏంటి ఈ మాటలు అని మీడియా సమావేశంలో హెచ్చరించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా అన్నట్లు దేవినేని ఉమా చురకలంటించారు.

కొడాలి నానీ బాటలో మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ .. చంద్రబాబుపై ఘాటుగా .. | Minister anil kumar yadav satires on chandrababu about polavaram project - Telugu Oneindiaఅవగాహన లేకుండా మాట్లాడకూడదు అని పేర్కొన్నారు. సబ్జెక్టు తెలుసుకోవాలి అధికారులను అడిగి డ్యామ్ అంటే ఏంటి, ఓవరాల్ ప్రాజెక్టు అంటే ఏమిటి ? ఇరిగేషన్ కాంపౌండ్ అంటే ఏమిటి ? ఇలా ఏమీ అవగాహన లేకుండా… బాధ్యతారహితంగా మాట్లాడటం సరి కాదని సూచించారు. అదేవిధంగా ప్రోగ్రెస్ ప్రాజెక్టు స్టేటస్ లో….71.13, 26 మే 2019, 70.83 19 మే, వైసీపీ అధికారంలోకి వచ్చాక 71.43…. 10 జూన్ చూపించడం జరిగిందని తెలిపారు.

 

అయితే జూన్ 20 వచ్చేప్పటికి 60.77 అని…, అంకెలు దచుకున్నా గాని అబద్దాలు చెప్పవని దేవినేని ఉమ తెలిపారు. ఇవన్నీ ఆన్ లైన్ లో సమాచారం అని క్లారిటీ ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వారం వారం ఇంటర్నెట్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ అని దేవినేని ఉమ తెలిపారు. ఈ విధంగా సమాచారం ఉంటే బాధ్యతారహితంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉండగా రెండేళ్లలో పూర్తి చేస్తాను అన్న మాటలు ఏమయ్యాయి అంటూ దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించారు.