Dhanush : ధనుష్‌తో పూజా హెగ్డే..మరో పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్..!

Share

Dhanush : టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలాగే క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో పూజా హెగ్డే తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విజయ్ సరసన రెండవ సినిమాతో కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత మళ్ళీ అవకాశం దక్కలేదు. ఇప్పుడు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.

dhanush and pooja hegde in another pan indian movie
dhanush and pooja hegde in another pan indian movie

ఇదే క్రమంలో తాజాగా ధనుష్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో పూజాని హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. ఈ మూవీ తెలుగు – తమిళం భాషలలో ఒకేసారి తెరకెక్కనున్న సినిమా కావడంతో రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ అయితే ప్రాజెక్ట్ కి మంచి హైప్ క్రియేట్ అవుతుందనే అభిప్రాయంతో మేకర్స్ భావించారట. అందుకే పూజాని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారట.

Dhanush : ధనుష్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు.

ధనుష్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాను చేస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో రూపొందనుంది. తాజాగా మరో సినిమాను కూడా ధనుష్ కన్ఫర్మ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి ఇటీవల నితిన్ – కీర్తి సురేష్ జంటగా రంగ్ దే సినిమాను తెరకెక్కించాడు. అంతకముందు మిస్టర్ మజ్ఞు తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈసారి ధనుష్ తో చేయబోయేది పాన్ ఇండియన్ సినిమా. ఇది ఎలా ఉంటుందో చూడాలి.


Share

Related posts

YV Subba Reddy: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవీ దంపతులు

somaraju sharma

Tamilnadu sisters : తండ్రి ఆశీర్వాదం కోసం 6 లక్షలు ఖర్చు చేసిన కూతురు!

Teja

పవన్ మాట వినేదెవరు?  రాజీనామాకు స్పందించేదెవరు?

sekhar