Dhanush : ధనుష్ మరో తెలుగు స్ట్రైట్ సినిమా..నిర్మాణ సంస్థ ఏదో తెలుసా..?

Share

Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు కమిటవుతున్నాడు. ఇప్పటికే తెలుగులో డెబ్యూ ఇస్తున్న సినిమాను మరో రెండు భాషల్లో కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తో ఒక సినిమా చేయనున్నట్లు రీసెంట్ గా అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాను ఏషియన్ సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు కలిసి దాదాపు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళంలో స్ట్రై గా చేస్తున్నారు.

dhanush another straight movie in telugu
dhanush another straight movie in telugu

ఈ సినిమా ఇంకా మొదలవకముందే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ ‘రంగ్ దే’ లాంటి యూత్ ఫుల్ మూవీస్ తెరకెక్కించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ఈ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి మాత్రం దీనికి సంబంధించిన కంఫర్మేషన్ రాలేదు. కానీ తాజాగా ధనుష్ తెలుగులో తన రెండవ సినిమా చేయనున్నాడని వస్తున్న వార్తలు నిజమే అని హింట్ ఇచ్చారు. జూలై 28న ధనుష్ బర్త్ డే.

Dhanush : ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ రానుందని కంఫర్మ్ అయింది.

ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు స్పెషల్ పోస్టర్ తో ధనుష్ కి విషెస్ తెలిపారు. అంతేకాదు ఈ పోస్టర్ లో ధనుష్ నీట్ గా టక్ చేసుకొని క్లాసీగా కనిపిస్తున్నాడు. ఈ స్పెషల్ పోస్టర్ ద్వారా ధనుష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ధనుష్ కు బర్త్ డే విషెస్ అందించడంతో పాటు ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ రాబోతోందని దాదాపు కంఫర్మేషన్ ఇచ్చారు. రంగ్ దే తర్వాత వెంకీ అట్లూరి సితారా వారితో మరో సినిమా కమిట్ అయినట్లు చెప్పుకున్నారు. మొత్తానికి సితార బ్యానర్ లో ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ రానుందని కంఫర్మ్ అయింది.


Share

Related posts

యుపిలో బీజేపీ నేత దారుణ హత్య

somaraju sharma

సభ పరువు మంటగలుస్తోంది!

Siva Prasad

మీకు గురక సమస్య ఉన్నట్లు అయితే అస్సలు అశ్రద్ధ చేయవద్దు…

Kumar