Dhanush: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందనగానే ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు, అటు కోలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఖుషి అయ్యారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్‌తో కలిసి ఫిదా, హ్యాపీడేస్ ఫేమ్ శేఖర్ కమ్ముల ఎలాంటి మూవీ తెరకెక్కిస్తాడనేది ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. ఒక తమిళ స్టార్ హీరో తెలుగు డైరెక్టర్‌తో సినిమా చేయడం అనేది ఒక ఆశ్చర్యమయితే.. అతను శేఖర్ కమ్ముల మూవీలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం ఇంకో ఆశ్చర్యం.
Dhanush: ఇంకా పట్టాలెక్కని సినిమా
ఈ సినిమా అనౌన్స్మెంట్ హడావుడిగానే జరిగింది కానీ ఆ మూవీ ఇప్పటివరకైతే పట్టాలెక్కలేదు. మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఇద్దరిలో ఎవరూ కూడా ముందడుగు వేయడం లేదు. దీని తర్వాత ప్రకటించిన సినిమాని కూడా ధనుష్ పూర్తి చేశాడు. ఇప్పుడు వేరే సినిమాలో నటించడానికి కూడా రెడీ అవుతున్నాడు. కానీ శేఖర్ కమ్ముల సినిమా గురించి మాత్రం క్లారిటీ రావడం లేదు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ధనుష్, శేఖర్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధంగా లేడేమో అనే సందేహాలు వస్తున్నాయి. కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం అలాంటిది ఏమి లేదని ప్రచారం జరుగుతోంది.
అసలు ఎందుకు షూటింగ్ స్టార్ట్ కాలేదు
శేఖర్ కమ్ముల సినిమాకి -సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా సమయం కేటాయిస్తాడు. ఇప్పుడు ధనుష్ సినిమా విషయంలోనూ అదే చేస్తున్నాడట. ధనుష్ కోసం శేఖర్ కమ్ముల ఒక చారిత్రక కథను రెడీ చేస్తున్నట్లుగా టాక్. కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడులో స్థిరపడిన ఒక తెలుగు కుర్రాడి కథగా ఇది వస్తుందట. శేఖర్ కమ్ముల ఒకవైపు తెలుగు ప్రేక్షకులను, మరోవైపు తమిళ ప్రేక్షకులను మెప్పించేలా ఆ కథను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కథ మొత్తం పూర్తి అయ్యాక ధనుష్ డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉంటాయో చూసుకొని అప్పుడు ఈ సినిమాని స్టార్ట్ చేస్తారట. కాగా ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.