Dhanush: ధనుష్ ఫ్యాన్స్‌కి కికిచ్చే న్యూస్.. మూడు అవతారాలలో అదరగొట్టనున్న స్టార్ హీరో!

Share

Dhanush: తమిళ్ హీరో ధనష్ తన అద్భుతమైన నటనతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అసురన్ మూవీతో అతడు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి దుమ్మురేపుతున్నాడు. ఇటీవలే అవెంజర్స్ డైరెక్టర్స్ రస్సో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్న గ్రే మాన్ ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ధనుష్ మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ‘కెప్టెన్ మిల్లర్ (Captain Miller)’ అనే పేరుతో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.

Captain Miller: తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్

ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళంలో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ధనుష్ ట్రిపుల్ రోల్స్‌లో నటిస్తున్నాడు. ఇంతకుముందు డబుల్ యాక్షన్ చేసి ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టించుకున్న ధనుష్ ఇప్పుడు త్రిబుల్ యాక్షన్‌లో అదరగొట్టడానికి రెడీ అయిపోయాడు. ధనుష్ ఫొటోలతో ఒక చిన్న టీజర్ వీడియో కూడా ఇప్పటికే విడుదల చేశారు. ధనుష్ ముఖానికి కండువా కప్పుకుని బైక్ నడుపుతున్నట్లు ఆ వీడియో కనిపించింది.

పీరియడ్ డ్రామా

1930-40వ కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగిన కథగా ఇది ప్రేక్షకులను అలరించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో ధనుష్ నటించనున్న మూడు రోల్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాకి సెందిల్ త్యాగరాజు అర్జున్ త్యాగరాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి జి.వి ప్రకాష్ కుమార్ సంగీత బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ మూవీ 2023, సమ్మర్ లో విడుదల కానుంది. ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం ‘వాతి’లో నటిస్తున్నాడు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

21 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

46 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago