NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ధ‌ర్మ‌వ‌రం మ‌ళ్లీ వైసీపీదే… ప‌క్కాగా రాసిపెట్టుకోమంటోందెవ‌రు…?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ధ‌ర్మ‌వ‌రంలో కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి గెలుపు మ‌రోసారి ఖాయ‌మేనా? ఈ సారి కూడా ఆయ‌న సునాయాసంగా విజ‌యం ద‌క్కించుకుంటారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల‌లో వ‌చ్చిన మెజారిటీ 15666 ఓట్ల కంటే కూడా.. ఇప్పుడు డబుల్ అవుతాయ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఇదే ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి ఇంత ధైర్యానికి కార‌ణం ఏంటి ? ఒక‌వైపు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని టీడీపీ ప్ర‌చారం చేస్తోంది.

కానీ, మ‌రోవైపు కేతిరెడ్డి వంటివారు.. డ‌బుల్ మెజారిటీ ద‌క్కించుకుంటామ‌ని దీమా వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టీడీపీలో చిచ్చు రేగ‌డ‌మే. మూడేళ్ల కింద‌ట ధ‌ర్మ‌వ‌రం ఇంచార్జ్‌గా నియ‌మించిన యువ నాయ‌కుడు, ప‌రిటాల వార‌సుడు శ్రీరాం.. ఇక్క‌డి టికెట్ ఆశించారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మూడేళ్లుగా తిరుగుతున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యంలోనూ నారా లోకేష్‌తో క‌లిసి.. జిల్లా వ్యాప్తంగా న‌డిచారు. కానీ, తీరా ఎన్నిక ల‌స‌మ‌యంలో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యంపై పార్టీ ఆలోచ‌న‌లో ప‌డింది.

మూడేళ్ల క్రితం ఇక్క‌డ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ప్లేస్‌లో చంద్ర‌బాబు శ్రీరామ్‌కు ధ‌ర్మ‌వ‌రం ఇన్‌చార్జ్ ప‌గ్గాలు అప్ప‌గించారు. నాటి నుంచి శ్రీరామ్ నియోజ‌క‌వ‌ర్గం లో పార్టీ ని బ‌లోపేతం చేసే విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఇక ఇప్పుడు బీజేపీ తో పొత్తు నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నాయ‌కుడు గోనుగుండ్ల సూర్య‌నారాయ‌ణ ఉర‌ఫ్ వ‌ర‌దాపురం సూరికే ఈ టికెట్ దాదాపు క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది.

బీజేపీతో పొత్తులో భాగంగా ధ‌ర్మ‌వ‌రంసీటును ఆ పార్టీకి కేటాయించార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ విష‌యంతెలిసి.. ప‌రిటాల వ‌ర్గం నిప్పులు కురిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ్ర‌తిమాలుకున్న ప‌రిస్థితి నుంచి నేడు ధిక్కారం వ‌ర‌కు ప‌రిస్థితి చేజారింది. గ‌త రెండు మూడు రోజులుగా ధ‌ర్మ‌వ‌రంలోతీవ్ర నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డి టికెట్‌ను క‌నుక బీజేపీకి ఇస్తే.. ప‌నిగ‌ట్టుకుని..తాము సూరిని ఓడించి తీరుతామ‌ని ప‌రిటాల వ‌ర్గం ప్ర‌తిజ్ఞ‌లు చేస్తోంది.

ఇక ఇక్క‌డి టికెట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. మ‌రో పిఠాపురం ప‌రిస్థితి త‌లెత్తినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ, టీడీపీ వ‌ర్సెస్ బీజేపీగా ఉన్న ధ‌ర్మ‌వ‌రం రాజ‌కీయం అంతిమంగా.. వైసీపీకి మేలు చేస్తుంద‌ని మెజారిటీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సారి మ‌రింత మెజారిటీ ద‌క్కించుకుంటామ‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న కాన్ఫిడెన్స్ కామెంట్ల వెనుక కూడా ఇదే వ్యూహం ఉంద‌ని అంటున్నారు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju