Dhee 13 : ఢీ 13 షో ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద దూసుకుపోతోంది. ఢీ షో అంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు.. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుంది. డ్యాన్స్ ప్లస్ కామెడీ కలగలిసిన షో ఇది. అందుకే దీనికి అంత పాపులారిటీ. ఈ షోను డ్యాన్సర్లు డ్యాన్స్ షోగా మార్చితే.. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది… కామెడీ షోగా మార్చారు.

వీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ కామెడీయే కదా. దీన్ని రష్మీ, దీపికా పిల్లి… గ్లామర్ షోగా మార్చారు. అంటే ఒక్క షోలో అన్ని రకాల జానర్లు అన్నమాట.ఢీ షోలో కంటెస్టెంట్లు వేసే డ్యాన్సులు మామూలుగా ఉండవు. ఒక్కోసారి కంటెస్టెంట్లు వేసే డ్యాన్స్ కు జడ్జిలు మైమరిచిపోతారు. అప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లను హత్తుకోవడం, వాళ్లకు అభినందనలు తెలపడం లాంటివి ఉంటాయి. తాజాగా ఢీ షో లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ అదే జరిగింది.
Dhee 13 : కంటెస్టెంట్ తరుణ్ కు ముద్దు ఇచ్చిన జడ్జి ప్రియమణి
కంటెస్టెంట్ తరుణ్ చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ జడ్జి ప్రియమణికి నచ్చడంతో… తరుణ్ ను తన సీట్ వద్దకు పిలిచి మరీ.. మనోడి బుగ్గ మీద ప్రియమణి ముద్దు ఇచ్చింది. దీంతో సుడిగాలి సుధీర్ తో పాటు హైపర్ ఆది షాక్ అయ్యారు.
అదేంటి.. తరుణ్ కు ఇచ్చావు కానీ.. మాకు ఇవ్వలేదు అనగానే… తరుణ్ లాగ బేర్ బాడీతో, టై తో డ్యాన్స్ చేస్తే… మీకు కూడా ఇస్తాను. నాకు కూడా ఏం ప్రాబ్లమ్ లేదు అనగానే.. వెంటనే తమ షర్ట్ లు విప్పేసేందుకు కూడా రెడీ అయిపోయారు సుధీర్, ఆది. వామ్మో.. స్టేజ్ మీదనే షర్ట్ విప్పడానకే సిద్ధపడ్డారంటే… ప్రియమణి ముద్దు కోసం ఎంతకైనా తెగించేలా ఉన్నారు వీళ్లు.దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.