Dhoni: క్రికెట్ లవర్స్ కి సెన్సేషనల్ న్యూస్ భారత జట్టు లోకి రీఎంట్రీ ఇస్తున్న ధోనీ..!!

Share

Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. భారత క్రికెట్ జట్టుకు చరిత్రాత్మక విజయాలు అందించిన ధోనీ.. 2011 వ సంవత్సరంలో వరల్డ్ కప్ తన నాయకత్వంలో దేశానికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు 2007వ సంవత్సరంలో టీ 20 ప్రపంచకప్ గెలవడం జరిగింది. ఎంతో కూల్ కెప్టెన్ గా పేరు సంపాదించిన ధోనీ … కీలక సమయంలో చాలా క్లిష్టమైన ఆలోచనలు తీసుకోవటంలో సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేయడంలో చాలా స్పెషలిస్ట్. మ్యాచ్ లో టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయిన కానీ.. ఎన్నో సందర్భాలలో చివరివరకు నిలబడి..టీం నీ విజయతీరాలకు చేర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ధోని నాయకత్వంలో.. భారత జట్టు ప్రపంచ వ్యాప్తంగా ఓ వెలుగు వెలిగింది. ధోని కి ముందు గంగూలి నాయకత్వం ఏ విధంగా.. జట్టు రాణించినదో దాని కంటే రెండింతలుగా… ఇండియా టీం అంతర్జాతీయ క్రికెట్ లో రాణించింది.

The fall and rise of Mahendra Singh Dhoni | StumpsandBails

అన్ని ఫార్మాట్లలో కూడా అది టెస్ట్.. వన్డే.. టి20 అనే తేడా లేకుండా.. ప్రతి దానిలో ఇండియా టీం అత్యున్నత స్థానంలో ఉండేది. ఒకానొక టైం లో భారత జట్టు కేవలం స్వదేశంలో మాత్రమే రాణిస్తుందని అపోహ ఇతర క్రికెట్ టీం జట్లకు ఉన్న టైంలో.. ధోనీ కెప్టెన్సీలో ఇండియా ఆ మాదిరిగా కాకుండా… విదేశీ పిచ్లపై కూడా చరిత్రాత్మకమైన విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది. వికెట్ కీపర్ గా కెప్టెన్గా బౌలర్లకు అనేక సూచనలు ఇస్తూ మరోపక్క టీం ని కంట్రోల్ చేస్తూ… ఎటువంటి టైంలో ఏ ఆటగాడిని పిచ్చి పైకి దింపాలో.. వంటి విషయాలలో మంచి అవగాహనతో జట్టుని ముందుండి నడిపించాడు ధోని. అనంతరం భారత్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన లోని ఐపీఎల్ మ్యాచ్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. గెలవండి ఇప్పుడు మరోసారి భారత్ క్రికెట్ జట్టు లోకి రీఎంట్రీ ధోనీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. విషయంలోకి వెళితే ప్లేయర్ గా కాకుండా టీమ్ మేంటర్ గా ధోనీ.. టి20 వరల్డ్ కప్ టోర్నీకి భారత్ క్రికెట్ టీం కి వ్యవహరిస్తున్నట్లు .. బోర్డు సభ్యులు తెలిపారు.

టి20 భారత్ క్రికెట్ జట్టు…

భారత్ క్రికెట్ జట్టు టీం బోర్డు సభ్యులతో పాటు టీం కోచ్ రావిశాస్త్రి తోపాటు టీం కెప్టెన్ లతో ప్లేయర్లకు అంత చర్చించి నాకే ధోని..కి ఈ పోస్ట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఒమన్, యూఏఈలలో అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరిగే వరల్డ్‌కప్‌ లో పాల్గొనేందుకు బుధవారం ఇండియా టీం సభ్యులను ప్రకటించడం జరిగింది. భారత్ క్రికెట్ టీమ్..విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

ఆ పోస్ట్ కి ధోని కరెక్ట్ …

ఇదిలా ఉంటే ధోనీ మెంటార్ అంటూ.. బోర్డు కార్యదర్శి జైసా స్పష్టం చేశారు. మరోపక్క ఈ ఎంపికపై గౌతం గంభీర్ సీరియస్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న జట్టు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటే ఆ టైంలో మెంటార్ అవసరమవుతుంది కానీ ఆ పరిస్థితి ప్రస్తుత జట్టుకి లేదని.. మరి ఇలాంటి సమయంలో ధోనీ కి మెంటార్ పోస్ట్ ఇవ్వటం అర్థరహితమని.. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ లో పాల్గొన్న సమయంలో గంబీర్…మెంటార్ ధోనీ అనే దాని పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోపక్క భారత్ క్రికెట్ ప్రేమికులు.. ధోని కి ఈ పోస్ట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మరీ ఓవర్ గా .. పలు సందర్భాలలో రియాక్ట్ అవుతున్నారు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ధోని కి టి20 వరల్డ్ కప్ లో మెంటార్ గా తీసుకోవటం.. ఎంతైనా అవసరం ఉందని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.


Share

Related posts

Today Gold Rate: దిగొచ్చిన వెండి.. స్థిరంగా బంగారం.. భారీగా పెరిగిన కొనుగోళ్లు..!!

bharani jella

AK : పవన్ కల్యాణ్ ‘ఫ్యాన్స్’కి పిచ్చ కోపం తెప్పిస్తోన్న త్రివిక్రమ్!

Teja

మెట్రో పాసింజర్ లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!!

sekhar