NewsOrbit
న్యూస్

కూతుళ్ళని కన్న ఓ పేద తండ్రి కథ..! 13 ఏళ్లుగా విదేశాల్లోనే..!!

 

 

ఓ భారతీయ దళితుడు తన ఇద్దరి కుమార్తెల కట్నం డబ్బు సమకూర్చడానికి ఎడారి దేశమైన ఓమాన్ కు 13 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వదేశానికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకుందాం.

 

మహబూబ్ నగర్ జిల్లా గండి వీడు మండలం పగిడిగళ్ళ గ్రామానికి చెందిన సంధిగాళ్ళ కృష్ణయ్య అనే వ్యక్తి తన కుటుంబ భవిష్యత్తు కొరకు 13 ఏళ్ల క్రితం ఓమాన్ కు వలస వెళ్ళాడు. రెండు సంవత్సరాలపాటు అవకాశం వచ్చిన కంపెనీలో చట్టబద్ధంగా పని చేశాడు. తరువాత పారిపోయి చట్ట విరుద్ధంగా ఉంటూ కూలి పని చేసుకుని జీవితాన్ని సాగించాడు. ఈ 13 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా అతడు భారతదేశానికి రాలేదు. కరోనా సంభవించడం వల్ల గత ఆరు నెలలుగా ఎటువంటి కూలి పని లభించకపోవడంతో సరైన తిండి లేక ఇబ్బందులకు గురయ్యాడు. దీనికితోడు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో క్షయ వ్యాధి కూడా వచ్చింది. కరోనా సంక్షోభంలో కూలి పని కరువై మరోవైపు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో గత్యంతరం లేక స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే స్వదేశానికి రావాలని ఆరాటపడిన వీసా నిబంధనలు అతిక్రమించిన కారణంగా జరిమానా చెల్లించలేక పోవడంతో వెంటనే మాతృభూమికి రాలేకపోయాడు.

కృష్ణయ్య కుటుంబం తమ గోడును సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించడంతో మస్కట్ లోని భారతీయ ఎంబసీ వారి సహాయంతో ఓమాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఓమాన్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో అతని వీసా రద్దు చేసి దేశం విడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వడానికి ఆరు నెలల వ్యవధి తీసుకుంది. అప్పటివరకు అతని చికిత్సా, భోజనానికి అయిన ఖర్చు నరేంద్ర ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే ప్రవాసి సంఘం భరించింది.

మంచి కట్ల కుమార్, పిట్ల కిరణ్ కుమార్, మామిడి శ్యామ్, వేమన కుమార్, చేని ప్రభాకర్, ప్రసాద్, గురవయ్య, గరిగె గణేష్ వీరందరూ వీరందరూ ఓ మాన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంఘ సభ్యులు. వీరు కృష్ణయ్య కుటుంబ సభ్యులకే కాకుండా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన లక్ష్మణ్ కూడా సహాయం చేశారు. లక్ష్మణ్ గత నాలుగు సంవత్సరాలుగా అక్కడే అక్రమంగా ఉంటూ పని చేసుకుంటూ తన కుటుంబానికి డబ్బులు పంపించే వాడు. ఇప్పుడు కరోనా వలన పని లేక కుటుంబానికి డబ్బులు పంప లేకపోవడం, అప్పులు తీర్చలేక పోవడం వలన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయి రక్తపోటు పెరిగి మెదడులో రక్తస్రావం జరగక పోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఇతనిని కూడా స్వదేశానికి పంపించడానికి ఈ ఫ్రెండ్స్ సభ్యుల గ్రూపు సహాయం చేసింది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju