పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమిటయిన సినిమాలన్ని అనుకున్న సమయానికి పూర్తైతే మరో రెండు – మూడు సినిమాలు కూడా ఒప్పుకుంటాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అఫీషియల్ గా ఇప్పటికే క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కె చంద్ర సినిమాలు లైన్ లో ఉన్నాయి.
వకీల్ సాబ్ త్వరలో కంప్లీట్ చేసి నెక్స్ట్ క్రిష్ సినిమా లో జాయిన్ అవుతాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి.. సినిమాలని 2021 లోపు రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నాడు. అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాకపోయినప్పటికి ఈ మూడు సినిమాలకి సంబంధించిన పవన్ కళ్యాణ్ సీన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట.
కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమానే మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పన్ కొషియమ్’. ఈ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.12గా రూపొందిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటిస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
కాని త్రివిక్రమ్ సలహా మేరకే… ఇంకా చెప్పాలంటే గట్టిగా పట్టు పట్టడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా హైలెట్ అవడం తో పాటు కంటిన్యూస్ గా డేట్స్ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమాని ఫినిష్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చెప్పాడట. ఈ రకంగా ‘అయ్యప్పన్ కొషియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించడం వెనక త్రివిక్రమ్ ఉన్నాడన్న విషయం బయట పడింది అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!