న్యూస్ సినిమా

నాగార్జునతో పూరి జగన్నాధ్ ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరైనా ఊహించారా ..?

Share

నాగార్జునతో పూరి జగన్నాధ్ లది క్రేజీ కాంబినేషన్ అని అందరికీ తెలిసిందే. గతంలో nagarjuna – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇద్దరి కాంబినేషన్ లో బ్యాట్రిక్ సినిమా వస్తుందని భావించారు. nagarjuna – పూరి జగన్నాధ్ కూడా చాలా సార్లు ఆ ప్రయత్నాలు చేసినప్పటికి వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

puri jagannadh.. హీరో ఎవరైనా సినిమా రిలీజ్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోడు. గ్యారెంటీగా 4 నెలల్లో సినిమా రిలీజ్ కావాల్సిందే. అందుకే హీరోలందరూ puri jagannadh తో సినిమా చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉంటారు. కాగా ఇప్పుడు పూరి జగన్నాధ్ .. నాగ్ తో 3 వ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫ్రెంట్ గా ఉంటుందని సమాచారం. ఇలాంటి కాన్సెప్ట్ పూరి కూడా ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాడు.

లాక్ డౌన్ లో puri jagannadh నాగార్జున కోసం ఒక ఫ్యాంటసీ స్టోరీని రాసినట్టు తెలుస్తోంది. చారిత్రాత్మక కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు. నాగార్జున ని ఒక రాజుగా చూపించబోతున్నాడట పూరి. పూరి ఇప్పటి వరకు పక్కా కమర్షియల్ సినిమాలు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ సాధించాడు. మరి ఈసారి ఈ కథ తో సినిమా తీస్తే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో చూడాలి. కాగా ప్రస్తుతం puri jagannadh ..విజయ్ దేవర కొండ తో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి టైటిల్ అండ్ విజయ్ దేవరకొండ లుక్ మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతున్నారు.


Share

Related posts

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

somaraju sharma

Mahesh Babu: మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా గురించి సంచలన విషయం బయటపెట్టిన థమన్..!!

sekhar

Radhe shyam: ఇలాంటి టైమ్ లో ‘రాధే శ్యామ్’ కథ లీక్ చేసిన దర్శకుడు..ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar