న్యూస్ సినిమా

వరుణ్ తేజ్‌తో లావణ్య అఫైర్ పెట్టుకుందా.. ఎట్టకేలకు నిజం చెప్పిన స్టార్ హీరోయిన్!

Share

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లవ్ చేసుకుంటున్నారని, మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. సినీ సర్కిల్ లో ఈ విషయమై అప్పట్లో అలా రోజుల పాటు చర్చలు కూడా జరిగాయి. తర్వాత ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. దాంతో ఈ విషయం గురించి అందరూ మర్చిపోయారు. ఈ క్రమంలోనే మళ్లీ వీరి మధ్య అఫైర్ ఉందనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనికి కారణం ఇటీవల ఓ మెగా ఈవెంట్‌లో వరుణ్ తేజ్, లావణ్య కలిసి కనిపించడమే! కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి ఈ పుకార్లకు ఓ నిజంతో చెక్ పెట్టింది. వరుణ్‌తో తనకు ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేసింది.

వరుణ్ తో లావణ్య అఫైర్ పెట్టుకుందా?

“వరుణ్ తో కలిసి నేను 2 మూవీలు చేశా. అందుకని అతనితో నాకు అఫైర్ ఉందని రూమర్స్ క్రియేట్ చేస్తారా? అసలు ఈ రూమర్స్ వింటూంటేనే చిరాకుగా అనిపిస్తోంది. నేను అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నట్లు కొందరు పుకార్లు సృష్టించారు. వాటిని చూడగానే నేను షాక్‌కి గురయ్యాను. అసలు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు?” అని ఈ ముద్దుగుమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటివరకైతే తాను సింగిలేనని, ఎవరిని ప్రేమించడం లేదని తెలిపింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ వంటివి తాను అసలు నమ్మనని… అంత ఈజీగా ప్రేమలో పడే టైపు కాదని చెప్పుకొచ్చింది. దానికి నాకు చాలా అంటే మొదట ఆ వ్యక్తి తనకంటూ తగిన సమయం కేటాయించాలని అప్పుడే తానేంటో తాను తెలుసుకోగలనని, ప్రేమలో పడగలను అని తెలిపింది.

సక్సెస్ సెలబ్రేట్ చేసుకోను: లావణ్య

లావణ్య తన సినిమా కెరీర్‌లో సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ అందుకుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో తాను సక్సెస్‌లు సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడలేదని చెప్పింది. కానీ ఆ తర్వాత విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడమే సరైనదని తాను తెలుసుకున్నట్లు తెలిపింది. సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటే నలుగురితో పంచుకుంటేనే, హ్యాపీనెస్ డబ్బులు అవుతుందని చెప్పింది.


Share

Related posts

AP-TS: హైదరాబాద్ లో ఆస్తులుంటే.. మాటలు పడాలా? నోరెత్తకూడదా మంత్రి గారూ..?

Muraliak

బిగ్ బాస్ 4: ఎప్పుడూ ఏడవని అభిజీత్ ఏడవబోతున్నాడా??

sowmya

Reshma pasupuleti traditional pics

Gallery Desk