NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆశయం తీర్చకుండా విగ్రహమేలా! : ఇది ఇప్పుడు అవసరమా జగన్?

కొన్ని తల తిక్క పనులు వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టకుండా నే గృహప్రవేశం కార్డులు పంచితే నవ్వులపాలు అవుతాం. జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజిని దిగజార్చేలా కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి అపాయకరమైన చర్యలే.

(విషయం ఏమిటంటే)

పోలవరం నిర్మాణం పూర్తి చేసి వైయస్సార్ విగ్రహాన్ని 150 అడుగుల ఎత్తులో నెలకొల్పుతామని ఇటీవల మంత్రులు చెప్పారు. దీనికి బీజేపీ అడ్డుతగిలి అక్కడ వాజ్ పేయ్ విగ్రహం పెడతామంటూ చెప్పిన మాటలు రాజకీయ విమర్శలు వరకు వెళ్లాయి. పోలవరం అసలు పురోగతి ఏమిటి… దానిని పూర్తి చేసే దారులు ఏమిటి? ఉన్న అడ్డంకులే ఎలా దాటి ముందుకు వెళ్లాలి? అనేది ఆలోచించకుండా 2021 నాటికి 22 నాటికి పూర్తి చేస్తామంటూ తేదీలు చెబుతూ కాలం గడపడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందే తప్ప సానుకూలత రాదు. ఇప్పుడు తాజాగా అధికారులు చేస్తున్న పని ఏమిటో తెలుసా?? వైయస్సార్ విగ్రహ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన స్థలాలు పరిశీలిస్తున్నారు.

ఇప్పుడు అంత తొందరేం వచ్చింది

పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం వెనకడుగు వేసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. నిధులు విదిల్చే పరిస్థితి లేదు. 2014- 15 అంచనాల మేరకు మాత్రమే నిధులు ఇస్తామని, దానిలోనూ తాగునీరు, విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అయ్యే ఖర్చు మినహాయింపు చేశామని, ఆ నిధులు ఇవ్వమంటూ వాదిస్తోంది. 2019 అంచనాలను కేంద్రం ఆమోదించలేదు. కేవలం 2014 అంచనాల మేరకే 20,396 కోట్లను ఇస్తామని మొండికేస్తుంది. ఇందులోనూ 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు తీసేయగా, 6614 కోట్లు ఇచ్చేశామని, మిగిలిన 7054 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కు ఇస్తామని కేంద్ర జలవనరుల శాఖ ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. పోలవరం లో ఇప్పటివరకు డ్యాం నిర్మాణానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. పోలవరం నిర్మాణం పరంగా 373 గ్రామాలు ఖాళీ అయ్యాయి. లక్ష 5000 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వీరందరికీ పునరావాసం కల్పించాలి. అసలు ప్రాజెక్టులో మొదట పునరావాసం కల్పించిన తర్వాతే డ్యామ్ నిర్మాణానికి వెళ్లాలి. అయితే ఇక్కడ అంతా రివర్స్ అయింది. కనీసం ఐదు వేల కుటుంబాలు సైతం ఇప్పటివరకు పునరావాసం కల్పించలేకపోయారు. ఇప్పుడు వీరందరికీ పునరావాసం కల్పించాలంటే సుమారు 35 నుంచి 50 వేల కోట్ల వరకు ఖర్చు ఉంది. దీన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పూర్తి బాధ్యతలు తీసుకోకుండా కేవలం అడపాదడపా నిధులు ఇవ్వడం పై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడగలేక పోతుంది. ఇప్పుడు ఇన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సిన రాష్ట్రప్రభుత్వం వాటన్నింటినీ పక్కకి వదిలి వైఎస్ఆర్ విగ్రహం గురించి భూసేకరణకు దిగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఉండవల్లి కోపం ఇందుకే

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. పోలవరం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన గుర్రుగా ఉన్నారు. వైయస్ కలల ప్రాజెక్టు గా భావించిన పోలవరం పూర్తి చేయడం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి ఉండవల్లికి ఏమాత్రం రుచించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణం సైతం నత్తనడకన నడుస్తోంది. మొదటి నుంచి ఉండవల్లి ప్రాజెక్ట్ నిర్మాణ తీరుపై, ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాఫర్ డ్యాం నిర్మాణంలోనూ సరిగా వ్యవహరించలేదని ఆయన అధికారుల తీరును తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం విషయంలో వేగం పెరుగుతుందని, ఉన్న అడ్డంకులను కేంద్రంతో మాట్లాడి జగన్ పరిష్కరించుకుంటారు అని ఉండవల్లి అనుకున్నారు. అయితే పోలవరం విషయంలో కేంద్రం నిధులు తగ్గిస్తున్న జగన్ పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లు కనిపించకపోవడం ఉండవల్లి ఆగ్రహానికి కారణం. శనివారం అధికారులు వైఎస్ విగ్రహానికి భూ పరిశీలనా చేసిన అంశం ఉండవల్లికి కోపం తెప్పించింది. విగ్రహం పెట్టడం విషయంలో ఉండవల్లి కి ఏమాత్రం అభ్యంతరం లేకున్నా అసలు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో స్పష్టత లేకుండా, నిధుల విషయంలో ఒక పోరాటం లేకపోవడాన్ని ఉండవల్లి ఖండిస్తున్నారు. ఇప్పుడు యమ అర్జెంటుగా వైయస్ విగ్రహ ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదని, పోలవరం విషయంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారు అని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. అయితే దీంట్లో నిజం ఉంది. పోలవరం నిర్మాణం విషయంలో వేగం పుంజుకుంటాయి వచ్చే ఎన్నికల నాటికి జగన్ ప్రభుత్వానికి పెద్ద ప్లస్ లభిస్తుంది. తండ్రి ఆశయాన్ని నిలబెట్టిన వాడిగా జగన్ పేరు మారుమోగుతుంది. దీనిపై ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జగన్ కేవలం ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చి నిధులు పెంచాలని మామూలుగా అడుగుతున్నాను తప్పుగా దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కనిపించడం లేదు. జగన్ పోలవరం అంశాన్ని ఎత్తుకుంటే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. కేంద్రంతో పోరాడుతున్నారానే భావన వైఎస్ఆర్సీపీ కు మరోసారి అధికారం తెచ్చిపెడుతుందని చెప్పడంలో సందేహం లేదు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!