ఎప్పుడో రిలీజ్ కావాల్సిన నాని ‘ వి ‘ సినిమా థియోటర్స్ మూత పడ్డ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమా థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామన్న దిల్ రాజు బృందం వేరే దారి లేక మిగతా మేకర్స్ కంటే ఒకడుగు ముందుకు వేసి ధైర్యంగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అందరు కూడా ఇప్పటికే రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలను వి రిజల్ట్ చూసి స్టెప్ తీసుకోవాలనుకున్నారు. కాని అనూహ్యంగా ఈ సినిమా బోల్తా కొట్టింది.
దాంతో వి ఒక్క సుధీర్ బాబు కి తప్ప ..ఈ సినిమా టీం అందరికి షాకిచ్చింది. కేవలం వి సినిమా టీం కే కాదు ఇప్పుడు వి సినిమా మీద ఆధారపడ్డ మిగతా సినిమా మేకర్స్ ని డైలమాలో పడేసిందన్న టాక్ మొదలైంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని అనుష్క నిశ్శబ్ధం .. రాం రెడ్.. లాంటి సినిమాలు థియోటర్స్ లో రిలీజ్ అవుతాయా.. లేక నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతాయా అన్నది ఇప్పుడు క్లారిటీ రావడం లేదంటున్నారు.
ఇదిలా ఉంటే వి సినిమా రిజల్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ మీద పడే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఈ రెండు సినిమాలకి నిర్మాత దిల్ రాజు. ఇటీవల వకీల్ సాబ్ కి అమెజాన్ ప్రైం దాదాపు 100 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. కాని దిల్ రాజు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఆ అఫర్ ని రిజక్ట్ చేసినట్టు చేసినట్టు సమాచారం.
పవర్ స్టార్ తో సినిమా చేయాలన్నది 10 ఏళ్ళ నుంచి దిల్ రాజు కి ఉన్న అతిపెద్ద డ్రీం. కాబట్టే వకీల్ సాబ్ ని ఎట్టిపరిస్థితుల్లోను థియోటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా వకీల్ సాబ్ ఓటీటీలో వస్తుందని సందేహించాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చాలానే వచ్చి మేకర్స్ ని ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.