NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దమ్మాలపాటి కేసులో ప్రభుత్వం గెలిచిందా? అసలు సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ఏంటో తెలుసా?

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

ఏది సాధారణం?? ఏది అసాధారణం?? స్పదించాల్సింది ఎంత? స్పందించింది ఎంత? లీగల్ గా కొంచెం అవగాహన ఉన్నవారికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం దమ్మలపాటి × రాష్ట్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై స్టే విషయంలో కోర్టు వ్యవహరించిన తీరు దానిలో ఎన్నో అత్యుత్సహలు కనిపిస్తున్నాయన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. హై కోర్టు ఒక సాధారణ కేసులో అసాధారణంగా వ్యవహరించి, తన పరిధి దాటి ఇచ్చిన ఆర్డర్కు సుప్రీం వేసిన బ్రేకులుగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఆధారంగా

నేడు రాజ్యాంగ దినోత్సవం. ఈ కీలకమైన సమయంలోనే రాజ్యాంగంలో ముఖ్యమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో, దాన్ని ప్రజలకు అందించడంలో కీలకమైన ఆర్టికల్ 19 ప్రకారం ఇచ్చిన తీర్పుగా దీన్ని భావించాలి. ఆర్టికల్ 19 (1) ప్రకారం దేశ పౌరులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. దీన్ని అనుసరించి మీడియా సైతం నడుచుకుంటుంది. రాజ్యాంగ వ్యవస్థ లోని న్యాయస్థానాలు దీనిలో కొన్ని సవరణలు చేసాయి. కొన్ని అసాధారణ సమయాలలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ నియంత్రించేలా, ప్రజలకు సమాచారం తెలిపే మీడియాను నియంత్రించేలా కొన్ని అంశాలను చేర్చారు. కొన్ని అసాధారణ విషయాల్లో మీడియాను నియంత్రించేందుకు న్యాయ వ్యవస్థలో రూపందించిందే గ్యాగ్ ఆర్డర్. ఒక కేసులో కొందరు అసాధారణ వ్యక్తులు సంస్థలు ఉన్నప్పుడు ఆయా కేసు వివరాలను విషయాలను మీడియా ఎట్టిపరిస్థితుల్లో ప్రజలకు తెలియపరిచే బాధ్యత తీసుకోకూడదు. ఆ వ్యక్తుల భద్రత కరువు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ప్రకారం మీడియా నడుచుకోవాలి. అమరావతి భూముల కొనుగోలు విషయంలో కొన్ని అక్రమాలు జరిగాయంటూ, అక్కడ రాజధాని ఇతర కట్టడాలు వస్తున్నాయని ముందుగానే తెలుసుకొని రైతుల వద్ద భూమి అత్యంత చౌకగా కొన్ని స్వాధీనం చేసుకున్నారని డి ప్రధాన అభియోగం. ఈ కేసులో అప్పటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తో పాటు ప్రస్తుత సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుటుంబ సభ్యులైన ఇద్దరు కూతుళ్ళు వారితో పాటు మొత్తం 13 మంది ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీనిలో ఏసీబీ కేసు నమోదు చేయకముందే దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించి తనపై ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఆపేయాలని కోరారు. ఇది ప్రత్యేక కేసు. దీని తర్వాతే ఏసీబీ మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు అనంతరం దమ్మాలపాటి మరో హౌస్ మోషన్ పిటిషన్ వేసి తమ పేర్లను వేసి బయట పెట్టడానికి వీలులేదని హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు ఇది అసాధారణ కేసు గా భావించి వెంటనే ఆర్డర్ ఇచ్చింది.

అసాధారణం ఏముంది??

హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ విషయంలో, హౌస్ మోషన్ పిటిషన్ వేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఎలాంటి దర్యాప్తు తమ అనుమతి లేకుండా చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లకు సంయుక్తంగా గ్యాంగ్ లీడర్ విషయంలో స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కేసులో దమ్మాలపాటి మీద ఏసీబీ దర్యాప్తు విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అనుసరించాలని, చెప్పిన సుప్రీం ధర్మాసనం గ్యాగ్ ఆర్డర్ విషయంలో మాత్రం స్టే విధించింది. ఈ కేసులో అసాధారణ వ్యక్తులు ఎవరూ లేరని, మీడియా ను నియంత్రించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన రాజీవ్ ధావన్ ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. గ్యాగ్ ఆర్డర్లపై స్టే విదించడానికి అంగీకరించింది. దీంతో గ్యాగ్ ఆర్డర్ విషయంలో దమ్మాలపాటి ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను తాము నిర్వహిస్తామని అప్పటివరకు కేసును హైకోర్టు విచారణకు తీసుకోవద్దని మరో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో ఉన్న నిందితులు 13 మంది పేర్లు వారి వివరాలను మీడియా లో ప్రస్తావించడానికి అవకాశం ఏర్పడింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టుకు అందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు 13 మంది నిందితుల పేర్లను ఇతర వివరాలు వెల్లడించేందుకు వీలుండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎవరికీ మోదం… ఖేదం?

ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా తీర్పు అనేది విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే సుప్రీం ఇచ్చిన తీర్పు కేవలం మీడియా నియంత్రణ విషయంలో రాజ్యాంగ సూత్రాలలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇచ్చిన ఆదేశాలు గానే భావించాలి. ఈ కేసు దర్యాప్తు విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ మీద తమ అనుమతి లేకుండా ఎలాంటి దర్యాప్తు విచారణ చేయవద్దని హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల కు సంబంధం లేదు. ఇది ఏ రకంగానూ కేసును ప్రభావితం చేసేది కాదు. దమ్మాలపాటి వేసిన కేసు ఇంకా హైకోర్టు విచారణ లోనే ఉంది. దీనిపై ఇలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు సుప్రీంకోర్టు తెలిపింది. జాగర్ విషయంలో దమ్మాలపాటి వేసే కౌంటర్ ను పరిశీలించిన తర్వాత సుప్రీం ఈ కేసు విషయంలో హైకోర్టు కు తగిన సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆ కేసును దీన్ని విడివిడిగా చూసి అమరావతి భూముల కొనుగోలు కేసును పూర్తిగా హైకోర్టు పర్యవేక్షించాలని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుత సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరికీ ఎవరికీ చేయడం కానే కాదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజ్యాంగంలోని అసాధారణ వ్యక్తుల విషయంలో ఉన్న కొన్ని పరిమితులను హైకోర్టు తన అసాధారణ అధికారాలను ఆదేశాలను ఉపయోగించి దుర్వినియోగం చేసే సమయంలో ఈ కేసును న్యాయ నిపుణులు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాక హైకోర్టు ఇచ్చే ఆదేశాలు అపరిమితంగా ఉన్నప్పుడు దీన్ని ప్రత్యేకంగా చూపవచ్చు. ఏదిఏమైనా హైకోర్టు ఆదేశాలు, వాటి తీరు మీద గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకు ఈ సుప్రీం ఆదేశాలు ఎడారిలో ఎండమావి లాంటిదే అని చెప్పుకోవచ్చు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!