Phone Safety: ఫోన్ పొరపాటున నీళ్ళలో పడిందా , లేదా ఫోన్ మీద నీళ్ళు పడ్డాయా — వెంటనే ఇలా చేయండి ఏం కాదు !

Share

Phone Safety: కొన్ని సార్లు అనుకోకుండా వర్షంలో   తడిస్తే   మనతో  పాటు ఉన్న మన మొబైల్ కూడా తడిసిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే  ఏమి చేయాలో తెలుసుకుందాం.ప్రస్తుతం  ఫోన్ల కోసం ప్లాస్టిక్ కవర్లు,  వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అందుబాటులో  ఉంటున్నాయి. వాటిని కొనుక్కుని   మొబైల్‌ని వాటిలో పెట్టుకోవడం  సరయిన పని . ఒకవేళ  ప్లాస్టిక్ బ్యాగ్‌ని వాడడం  ఇష్టం లేకపోతే మీ ఫోన్‌ని హ్యాండ్ బ్యాగ్‌లోనే  ఉంచి . అందులోంచి బయటకు తీయకండి. దీనివల్ల  ఫోన్ లో కి నీళ్లు పోయే అవకాశం చాలా వరకు  ఉండదు. వర్షం  పడుతున్న సమయం లో  ఫోన్ చేతిలో పట్టుకొని లేదా జేబులో పెట్టుకొని ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు.
మీ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు, మెయిల్స్ వంటివన్నీ ఎప్పటికప్పుడు బ్యాకప్   చేసుకుంటే.. సమాచారాన్ని వేరే ఎక్కడా కాకుండా.. గూగుల్ డ్రైవ్‌లోనే సేవ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురై ఫోన్ పాడైనా కూడా మీకు కావలసిన  సమాచారం  జాగ్రత్తగా  ఉంటుంది.

వర్షం పడే సమయంలో అప్పుడప్పుడు వోల్టేజ్ ఫ్లక్ చుయేషన్స్  జరుగుతుంటుంది. ఇలా జరిగే సమయంలో మీ ఫోన్‌ని ఛార్జింగ్ పెట్టకుండా  ఉండడం  మంచిది అనుకోకుండా ఫోన్ వానలో తడిసిన,నీళ్లల్లో పడిపోయినప్పుడు   ఈ చిట్కాలు  ప్రయోగించండి.
మీ ఫోన్  వర్షంలో తడవటం లేదా నీళ్లలో పడిపోవడం జరిగినప్పుడు   వెంటనే దానిని స్విచ్ఛాఫ్  చేయండి.ఫోన్ లో కి నీళ్లు వెళ్లిపోయాయి పనిచేస్తుందా? లేదా? అని చెక్ చేయాలనిపించడం చాలా సహజం.  అయితే  తడిగా ఉన్నప్పుడు అలా ఫోన్ మాట్లాడటం అనేది  సరికాదు.ఫోన్ నీళ్లలో తడిచినప్పుడు  దాన్ని కాటన్ క్లాత్, టిష్యూ పేపర్  వంటి వాటితో తడి నంతటిని  తుడిచేయాలి. కేవలం బయట మాత్రమే  కాదు.. ఫోన్ లోపల తుడిచే వీలుంటే మాత్రం  ఆ పని కూడా  చేయాలి. ఫోన్ త్వరగా తడి  ఆరిపోవడానికి అని చాలామంది హెయిర్ డ్రయ్యర్‌ని  వాడుతుంటారు.  ఇలా అసలు చేయకూడదు. హెయిర్ డ్రయ్యర్ లోనుంచి వచ్చే  వేడి ఫోన్‌ని పాడు చేస్తుంది. ఫోన్ ని కేవలం  ఫ్యాన్ కింద మాత్రమే   ఆరబెట్టాలి.

మీ  ఫోన్‌లో తడిదనం త్వరగా  ఆరిపోవాలంటే.. దాన్ని కొంచెంసేపు బియ్యంలో  పెట్టండి. అప్పుడు బియ్యం ఫోన్‌లోని తడినంతా  లాగేస్తుంది.  ఒక డబ్బాలో మీ ఫోన్ మునిగే వరకు  బియ్యం తీసుకుని అందులో  ఫోన్  ఉంచితే సరిపోతుంది.ఇంత చేసిన కూడా  ఫోన్ పూర్తిగా తగ్గిపోతుంది అన్న    గ్యారెంటీ ఏమి  లేదు. కాబట్టి రెండు మూడు రోజుల వరకూ   ఫోన్ ఆన్  చేయకూడదు.     అప్పటివరకూ వేరే ఫోన్ వాడుకోవడం  మంచిది.ఇదంతా ఎందుకు అనుకుంటే.. ఫోన్ రిపేర్ చేసే నిపుణుల  దగ్గరకు   మొబైల్‌ను తీసుకెళ్లండి. దాని లోపల ఎలాంటి డ్యామేజ్ జరగలేదని  చెబితే అప్పుడు  మరల దానిని తిరిగి  పడుకోవడం మంచిది. కాబట్టి ఫోన్ తడవగానే కంగారు పది ఛార్జింగ్ లాంటివి పెట్టకుండా తుడిచి ఆరనివ్వండి. పైన చెప్పిన చిట్కాలు కూడా పాటించి చూడండి


Share

Related posts

వల్లభనేని వంశీ వైసీపీ కి అద్దె నాయకుడు అంటున్న యార్లగడ్డ..!!

sekhar

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఫైనల్ నిర్ణయం ఇదే…? దిల్లీ నుండి వచ్చిన నివేదిక ఏంటటే….

siddhu

టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అనర్హతవేటు

Siva Prasad