Vishwak Sen: నిన్నటినుండి టాలీవుడ్ వర్ధమాన నటుడు అయినటువంటి విశ్వక్ సేన్ కి మరియు టీవీ9 ఛానల్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈరోజుకి అది సద్దుమణిగేలా కనబడటం లేదు. విషయం అందరికీ విదితమే. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఫ్రాంక్ వీడియో వలన హీరో విశ్వక్ సేన్ పలు విమర్శల పాలయ్యాడు. అయితే దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తే, మరికొంతమంది మాత్రం టీవీ9 ఛానల్ వారే అతిచేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ న్యూస్ ఛానల్ లో విశ్వక్ సేన్ ను ‘పాగల్ సేన్’ అని పిలుస్తారని.. అతనొక ‘డిప్రెస్డ్ మ్యాన్’ అని యాంకర్ దేవీ అనడం పై విశ్వక్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హీరో విశ్వక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ‘గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో’ అంటూ గట్టిగా అరిచింది దేవి. అంతేకాకుండా విశ్వక్ బయటకు వస్తున్న సమయంలో ‘వెధవ.. నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో’ అంటూ దేవి అనడం సదరు వీడియోలో గమనించవచ్చు. ఈ ఇష్యూలో నెటిజన్లు టీవీ9 యాంకర్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు చేసారు. హీరో వ్యవహార శైలి ఎలా ఉన్నా.. అతన్ని స్టూడియోకి పిలిచి ఇలా అవమానించడం జర్నలిజం అనిపించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు టీవీ9 యాంకర్ దేవి పై పరువు నష్టం దావా వేయాలని విశ్వక్ సేన్ అనడం మనం చూసాం. అయితే ఇపుడు విశ్వక్ సేన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె పై పరువు నష్టం కేసు ఫైల్ చేయడానికి ఇప్పటికే అతని లీగల్ టీమ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే టీవీ9 డిబెట్ లో విశ్వక్ సేన్ అభ్యంతరకరమైన F*** అనే పదాన్ని వాడుకొని ఆ ఛానల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…