BIRYANI: మూలుగు బొక్క బిర్యానీ గురించి మీకు తెలుసా …?

Share

BIRYANI: నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టపడేది బిర్యానీ. చాలా సిటీస్ లో డిఫరెంట్ టేస్ట్ తో కొత్త రకం బిర్యానీలు రెడీ అవుతున్నాయి. పైగా హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హైదరాబాద్ కి వెళ్లారంటే బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. ఆ టేస్ట్ ఎక్కడ రాదని నగర వాసులు అంటుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు దూరంగా ఉన్న సరే వెళ్లి తినాలి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరో బిర్యానీ అందరిని ఆకట్టుకుంటుంది. అదే మూలుగు ”బొక్క బిర్యానీ”. ఇప్పుడు ఈ బిర్యానీ గురించే నగరంలో టాక్ నడుస్తోంది. ఈ బిర్యానీ మహారాష్ట్రలోని ముంబై సిటీలో బాగా ఫేమస్. అయితే ఇప్పుడు ఈ బిర్యానీ హైదరాబాద్ రెస్టారెంట్ లలో వచ్చేసింది. దీంతో కొత్త రకం బిర్యానీ రావడంతో ఫుడ్ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ బిర్యానీ టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు మళ్ళీ ఇదే బిర్యానీ తినాలి అనుకుంటున్నారని హోటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ బిర్యానీని ‘నల్లిబిర్యానీ’ గా పిలుస్తున్నారు. మటన్ లోని నల్లి బొక్కలతో ప్రత్యేకంగా ఈ వంటకాన్ని తయారు చేయడంతో ఈ బిర్యానీకి ఈ పేరు వచ్చిందని చెబుతున్నారు. చికెన్ బిర్యానీకి పోటీగా ఈ బిర్యానీ ఉంటుందని అంటున్నారు. నార్మల్ గా అయితే బిర్యానీలో బాస్మతి రైస్ చికెన్ లేదా రైస్ ను కలిపి వండుతారు. కానీ ఈ ‘నల్లిబిర్యానీ’ ని స్పెషల్ గా వండుతారు. రైస్ ని సెపెరేట్ గా, నల్లి బొక్కలను సపెరేట్ చేసి వండుతారు. ఈ రెండింటిని కలిపి సర్వ్ చేస్తారు. నల్లి ఎముకలకు బిర్యానీ రెసీపీ తోడవడటంతో ఈ బిర్యానీకి మరింత టేస్ట్ వస్తుంది. దీంతో ఒక్కసారి ఇది తింటే ఫుడ్ లవర్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు.

MAA Elections: బండ్ల గణేష్ బిగ్ ట్విస్ట్..షాక్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్

హైదరాబాద్ లో ఇప్పుడు ఈ బిర్యానీ అన్ని ఏరియాల్లోకి వచ్చేసింది అని అంటున్నారు. రెస్టారెంట్ లలో ఈ బిర్యానీ కోసం పోటీపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. దీని రేట్ ఎక్కువ అయినప్పటికీ కొనడానికి మాత్రం ఆలోచించడం లేదు. దీంతో ఇది తయారు చేసేవారికి కూడా ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ బిర్యానీ అన్ని సిటీస్ లో వచ్చే అవకాశం ఉంది. బిర్యానీ లవర్స్ మాత్రం ఫస్ట్ ఈ బిర్యానీని ప్రిఫర్ చేస్తున్నారు.

Moringa: ఆరోగ్యానికి పర్మినెంట్ అడ్రస్ ఈ ఆకు..!! 


Share

Related posts

నాదెండ్ల విషయం లో పవన్ కల్యాణ్ ఫాన్స్ లో భిన్న అభిప్రాయాలు !!

Yandamuri

రివేంజ్ తీర్చుకున్న రావ‌ణుడు.. ఎక్క‌డో తెలుసా..?

Teja

మత్స్యావతారం రూపమే శ్రీవేదనారాయణ స్వామి !

Sree matha