Credit Card: మీకు ఆమాత్రం జీతం ఉంటే చాలు. ఇపుడు క్రెడిట్ కార్డులు మీ ఇంటికే వచ్చి వాలుతున్నాయి. అయితే మార్కెట్లో ఎన్నో రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో వున్నాయి. మనం తీసుకొనేటప్పుడే మంచి క్లారిటీతో తీసుకోవాలి. లేదంటే సదరు బ్యాంక్స్ వాళ్ళు వడ్డీ తడిసి మోపిడేస్తారు. ఇక విషయంలోకి వెళితే, మార్కెట్లోకి ఓ సరికొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ కొత్త క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. ఇది కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు.
Venkatesh – Rana: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వెంకీ – రానా కాంబో ఇప్పటికి సెట్ అయింది..దీని వెనకుంది ఆయనేనా..?
Credit Card: ఈ కొత్త క్రెడిట్ కార్డు విశేషాలు ఏమిటి?
ఇది రూపే క్రెడిట్ కార్డు. ఇందులో మనం రెండు రకాలు చూడవచ్చును. PNB రూపే ప్లాటినం, PNB రూపే సెలెక్ట్ అనే రెండు రకాలు కలవు. ఈ రెండు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ద్వారా పతంజలి స్టోర్స్‌లో కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎందుకంటే ఇందులో పతంజలి వారి భాగస్వామ్యం వుంది. లాయల్టీ పాయింట్లుతో పాటు ఇన్సూరెన్స్ కవరేజి కూడా పొందొచ్చు. ఇలా పలు రకాల ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. కార్డు పొందిన దగ్గరి నుంచి మూడు నెలల వరకు కార్డు లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ లభిస్తుందని చెప్పడం గమనార్హం.
Ysrcp: జగన్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన వైసీపీ కార్యకర్తలు..!!
వివిధ రకాల బెనిఫిట్లు ఇవే..
– కస్టమర్లకు ఉచితంగా దేశీ, విదేశీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఈజీగా లభిస్తుంది.
– EMI వంటి బెనిఫిట్స్ అనేకం వున్నాయి.
– ప్లాటినం, సెలెక్ట్ కార్డులపై ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.
– రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కలవు.
– అంతేకాకుండా యాక్సిడెంటల్ డెత్, పర్సనల్ టోటల్ డిస్‌ఎబిలిటీ కవరేజ్ కలదు.
– ప్లాటినం కార్డుపై రూ.5 లక్షల వరకు సెలెక్ట్ కార్డుపై రూ.10 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తుంది.